Surya Kumar Yadav Donation: టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ లోకల్ టోర్నమెంట్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పర్సీ జిమ్ఖానా, పయ్యాడే స్పోర్ట్స్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 152 బంతుల్లో 259 పరుగులు చేశాడు. అనంతరం 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు'ను సొంతం చేసుకున్నాడు. అయితే.. ఈ అవార్డును మైదానంలోని గ్రౌండ్స్‌మెన్‌కు కానుకగా ఇచ్చి అందరి మనసను గెలుచుకున్నాడు.
"పిచ్‌ను తయారు చేయడం కోసం గ్రౌండ్స్‌మెన్ ఎంతో శ్రమిస్తారు. అందరికన్నా ముందు వారే గ్రౌండ్‌కు వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటారు. ఇంతచేసినా వారికి సరైన గుర్తింపు ఉండదు. ఆరంభంలో క్రికెట్ ఆడటానికి ముందు నేను కూడా గ్రౌండ్స్‌మెన్‌తో కలిసి పిచ్‌ను రోల్ చేసేందుకు వెళ్లేవాడిని."
-సూర్యకుమార్ యాదవ్, టీమ్ఇండియా ఆటగాడు.
చాలా మంది క్రికెటర్లు.. గ్రౌండ్స్‌మెన్ పనితీరును మర్చిపోతారని సూర్యకుమార్ అభిప్రాయపడ్డాడు. కానీ, వారితో తనకున్న అనుబంధం అందరిలా కాదని చెప్పుకొచ్చాడు. క్రికెటర్లు తప్పనిసరిగా గ్రౌండ్స్‌మెన్ చేసే పనిని గుర్తుపెట్టుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.
'ఓ క్రికెటర్ గొప్పగా ఆడితే అందరూ అతడినే ప్రశంసిస్తారు. తర్వాత రోజు అతడిని పొగుడుతూ పేపర్లో వార్తలొస్తాయి. కానీ, గ్రౌండ్స్‌మెన్ కృషిని ఎవ్వరూ ప్రశంసించరు. కానీ, ఆటగాళ్లు తప్పనిసరిగా వారిని గుర్తుపెట్టుకోవాలి. ఓ వ్యక్తి మంచి ప్లేయర్‌గా ఎదిగేందుకు గ్రౌండ్స్‌మెన్ పరోక్షంగా సహాయం చేస్తారు. మంచి ట్రాక్ సిద్ధం చేస్తారు" అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
ఇదీ చదవండి: