Gavaskar Slams NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ డ్రా అవ్వడంలో కివీస్ ఆటగాళ్లు అజాజ్ పటేల్, రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించారు. అయితే.. భారత్ విధించిన టార్గెట్‌ను ఛేదించడం కాకుండా వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారంటూ న్యూజిలాంట్ జట్టు బ్యాటింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు టీమ్ఇండియా దిగ్గజం సునీల్ గావస్కర్. డ్రాగా ముగించేందుకే ప్రయత్నం చేయడమేంటని ప్రశ్నించాడు.
"భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో ఇన్నింగ్స్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఐదో రోజు భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వికెట్లు కోల్పోతుండటం మొదలవ్వగానే కివీస్‌పై ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ కివీస్ గెలవడానికి ప్రయత్నించకుండా, డ్రాగా ముగించడంపైనే ధ్యాసపెట్టింది."
-సునీల్ గావస్కర్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
లాథమ్, విల్లే శుభారంభం ఇచ్చినా..
IND vs NZ 1st test: "రెండో ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక లాథమ్, సోమర్ విల్లే కివీస్ జట్టుకు శుభారంభం ఇచ్చారు. ఐదో రోజు లంచ్ విరామం సమయానికి.. టీమ్ఇండియా కెప్టెన్ రహానే, హెడ్ కోచ్ ద్రవిడ్ మ్యాచ్ చేజారిపోతుందేమో అని కూడా అనుకొని ఉండొచ్చు. కానీ, తర్వాత సీన్ మారిపోయింది. కివీస్ కీలక వికెట్లు కోల్పోయి మ్యాచ్ డ్రా చేస్తే చాలనే పరిస్థితికి వచ్చింది" అని గావస్కర్ అన్నాడు.
ఇదీ చదవండి:
IND vs NZ Test: డ్రాగా ముగిసిన భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు
IND vs NZ 2nd Test: కరోనా ఎఫెక్ట్- పరిమిత సంఖ్యలో ప్రేక్షకులు