ETV Bharat / sports

క్రికెటర్లకు కొత్త రూల్స్.. రిటైర్​ అయ్యాక ఆరు నెలలు ఆగాల్సిందే

SLC new Rules: క్రికెటర్ల రిటైర్మెంట్​ ప్రక్రియ కోసం శ్రీలంక క్రికెట్​ బోర్డు కొత్త నిబంధనలను అమలు చేసింది. ఆటకు వీడ్కోలు చెప్పాలనుకునే ఏ ఆటగాడైనా మూడు నెలలు శ్రీలంక బోర్డు తరఫున ఆడాలని రూల్ పెట్టింది.

slc
శ్రీలంక క్రికెట్
author img

By

Published : Jan 9, 2022, 4:22 PM IST

SLC new Rules: అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాలనుకునే తమ దేశ క్రికెటర్లపై కాస్త కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చింది శ్రీలంక క్రికెట్ బోర్డు. లంక క్రికెటర్లు ధనుష్క గుణతిలక, భానుక రాజపక్ష ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

శ్రీలంక బోర్డు కొత్త నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ ప్రకటించాలనుకునే ఏ క్రికెటరైనా శ్రీలంక క్రికెట్​లో మూడు నెలలపాటు సేవలందించాలని ఓ క్రీడా ఛానల్​ పేర్కొంది. అయితే.. ఆ ఆటగాడు వీదేశీ టోర్నీల్లో ఆడేందుకు అవసరమైన నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్​ఏసీ) పొందేందుకు మరో ఆరునెలలు వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

లంక ప్రీమియర్ లీగ్​లో ఆడే అర్హత సాధించేందుకు కూడా శ్రీలంక క్రికెటర్లు ఒక సీజన్​లో 80 శాతం దేశవాళీ మ్యాచ్​లు ఆడాలనే రూల్ ఉంది.

రిటైర్మెంట్​కు సిద్ధం!

చాలా మంది శ్రీలంక క్రికెటర్లు రిటైర్మెంట్​కు సిద్ధమవుతున్నారనే రూమర్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఫిట్​నెస్​ నిబంధనలు తప్పనిసరి అయిన నేపథ్యంలో ఈ రూమర్లకు ప్రాధాన్యం ఏర్పడిందని క్రికెటర్ అవిష్క ఫెర్నాండో ట్విట్టర్​లో తెలిపాడు. తాను ఇప్పుడప్పుడే రిటైర్​ అవనని పేర్కొన్నాడు.

ఎన్​ఓసీ లేకుండా చాలా టోర్నమెంట్లలో ఆటగాళ్లకు ఆడేందుకు అనుమతి లభించదు. రిటైర్​ అయిన ఆటగాడైనా సరే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఇదీ చదవండి:

ఆ ముగ్గురు మళ్లీ క్రికెట్ ఆడొచ్చు.. నిషేధం ఎత్తివేత

భారత్​లోనే ఐపీఎల్​-2022.. బీసీసీఐ క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.