ETV Bharat / sports

'మరో మూడు జన్మలెత్తినా.. ఇండియాకే ఆడాలి' - బీసీసీఐ

భారత క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ.. సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును పంచుకున్నాడు. "మరో మూడు జన్మలెత్తినా క్రికెట్​ ఆడాలనుకుంటున్నా" అనే వ్యాఖ్యను జోడించాడు.

sourav Ganguly, Wishes To Do This In Next 3 Lives
సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
author img

By

Published : May 19, 2021, 4:16 PM IST

భారత మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్​​ గంగూలీ.. ఇన్​స్టాలో ఓ ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

భారత జెర్సీలో క్లాసిక్ లాఫ్టెడ్​ షాట్​ ఆడుతున్న తన ఫొటోను పోస్టు చేశాడు దాదా. దాని కింద "మరో మూడు జన్మలెత్తినా.. నేనిదే చేయాలనుకుంటున్నాను" అని రాసుకొచ్చాడు.

సుదీర్ఘ కాలం భారత్​కు ప్రాతినిధ్యం వహించిన గంగూలీ.. 311 వన్డేలు ఆడాడు. 40.73 సగటుతో 11,363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు ఉండగా.. మరో 72 అర్ధ శతకాలు ఉన్నాయి. అంతే కాక 100 వికెట్లతో బౌలింగ్​లోనూ సత్తా చాటాడు సౌరభ్. ఐపీఎల్​లో కోల్​కతాతో పాటు పుణె వారియర్స్​ జట్టుకు ఆడిన గంగూలీ.. మొత్తం 59 మ్యాచ్​ల్లో 1349 పరుగులు చేశాడు.

ఇదీ చదవండి: ఐపీఎల్​లో కొత్త జట్లు ఇప్పట్లో లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.