ETV Bharat / sports

Six Wickets in an Over: ఒకే ఓవర్లో 6 వికెట్లు..చరిత్ర సృష్టించిన బౌలర్​

Six Wickets in an Over: ఒక ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీస్తేనే గొప్పగా భావిస్తుంటాం. అదే ఒక్క ఓవర్లో ఆరు వికెట్లు పడగొడితే.. కచ్చితంగా అద్భుతమనే చెప్పాలి. అలాంటి ఘటనే నేపాల్ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో చోటు చేసుకుంది. ఇంతకీ ఆ మ్యాచులో ఏమైందంటే.?

six wickets in an over
6 balls 6 wickets
author img

By

Published : Apr 13, 2022, 8:38 PM IST

Six Wickets in an Over: నేపాల్ ప్రో క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా పుష్‌ స్పోర్ట్స్‌ దిల్లీ, మలేషియా ఎలెవన్​ జట్ల మధ్య జరిగిన మ్యాచులో.. మలేషియా XI బౌలర్‌ విరన్‌దీప్ సింగ్‌ ఆఖరి ఓవర్లో ఆరు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. తొలి బంతిని వైడ్‌గా వేసిన విరన్‌ దీప్‌.. ఆ తర్వాత వరుసగా ఆరు వికెట్లు కూల్చాడు. ఇందులో హ్యాట్రిక్‌ సహా, ఓ రనౌట్ కూడా ఉండటం విశేషం.

19వ ఓవర్ వరకు 131/3 స్కోరుతో పటిష్ఠ స్థితిలో కనిపించిన పుష్‌ స్పోర్ట్స్‌ దిల్లీ జట్టు.. విరన్‌ దీప్ ధాటికి 132/9 స్కోరుకే పరిమితమైంది. ఇలాంటి ఘటన ఇంతకు ముందు, 1951 థామస్‌ హంటర్ కప్‌లో జరిగింది. విరన్‌దీప్ సృష్టించిన ఈ చరిత్రను మీరూ చూసేయండి.!

  • 6️⃣ wickets in 6️⃣ balls - have you ever seen it before?! 🤯

    Five wickets for Malaysia XI's Virandeep Singh plus a run-out in the final over against Push Sports Delhi in the Nepal Pro Club Championship 🔥 pic.twitter.com/eBTrlNwLuY

    — ESPNcricinfo (@ESPNcricinfo) April 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ మ్యాచులో, తొలుత బ్యాటింగ్‌ చేసిన పుష్‌ స్పోర్ట్స్ దిల్లీ జట్టు 132/9 స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మలేషియా XI 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదీ చూడండి: రోహిత్ తను 'హిట్​మ్యాన్' అని గుర్తుపెట్టుకోవాలి: సెహ్వాగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.