Shubman Gill Opening : క్రికెట్లో ఏ ఫార్మాట్లో అయినా జట్టు భారీ స్కోర్ సాధించాలంటే.. ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. అలా టీమ్ఇండియాలో కొద్ది కాలం నుంచి వన్డే, టీ20ల్లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు శుభ్‌మన్ గిల్. ఇక వీరి గణాంకాలు చూస్తే.. ఈ ఇద్దరిది సక్సెస్ఫుల్ జోడీ అనే చెప్పవచ్చు. వన్డేల్లో టీమ్ఇండియా తరఫున ఈ జోడీ 9 సార్లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించి.. 76.11 సగటున 685 పరుగులు జోడించారు. అయితే హిట్‌మ్యాన్‌తో కలిసి నిలకడగా రాణించడానికి గల కారణాన్ని గిల్ తాజాగా వెల్లడించాడు. మరి గిల్ ఏమన్నాడంటే..
క్రీజులో ఉన్నప్పుడు రోహిత్ ఆట తన బ్యాటింగ్‌కు భిన్నంగా ఉంటుందని గిల్ తెలిపాడు. "రోహిత్ ఎంపిక చేసుకునే షాట్లు.. నా బ్యాటింగ్ శైలి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పవర్‌ప్లే లో రోహిత్ ఒక దిశను లక్ష్యంగా చేసుకొని ఆడతాడు. నేను ఫీల్డర్ల మధ్య గ్యాప్‌లో ఆడుతూ.. బౌండరీలు బాదడానికి ఇష్టపడతాను. కానీ అతడు బంతిని స్టాండ్స్‌లోకి పంపాలనుకుంటాడు. ఈ కాంబినేషన్ అద్భుతంగా ఆడడానికి సక్సెస్ ఫార్ములాలా పనిచేస్తుంది. ఆలాగే అతడితో ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం గొప్ప అనుభుతినిస్తుంది. క్రీజులో నాకు నచ్చినట్లు ఆడేందుకు రోహిత్ పూర్తి స్వేచ్ఛనిస్తాడు. ఇక అందరి దృష్టి అతడిపైనే ఉంటుందని తెలుసు " అని గిల్ అన్నాడు. ఇక రానున్న ప్రపంచకప్‌లో కూడా వారి ఓపెనింగ్ భాగస్వామ్యాం జట్టుకు కీలకం కానుందని గిల్ పేర్కొన్నాడు.
Shubman Gill Odi Stats : వన్డేల్లో 27 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 62.48 సగటున, 104.06 స్ట్రైక్ రేట్‌తో 1381 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు, ఆరు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్.. డబుల్ సెంచరీ (208) సాధించాడు. దీంతో వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు.
Shubman Gill Odi Ranking : ఇక ఐసీసీ బుధవారం తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్ 743 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. కాగా ఇది గిల్ కెరీర్లో బెస్ట్ ర్యాంక్.
Subhman Gil IPL : కొత్త తరానికి సూపర్ స్టార్.. కప్పు కొట్టకున్నా ఛాంపియనే!
ICC Latest T20 Rankings : ర్యాంకింగ్‌లోకి దూసుకొచ్చిన జైస్వాల్.. కెరీర్ బెస్ట్‌లో గిల్..