ETV Bharat / sports

'కెప్టెన్సీలో రాణించాలంటే విధేయత కూడా ఉండాలి' - గిల్​ కామెంట్స్​ అతడ్ని ఉద్దేశించేనా? - శుభ్​మన్​ గిల్ లేటెస్ట్ న్యూస్

Shubman Gill Gujarat Titans : యంగ్​ ప్లేయర్​ శుభ్​మన్​ గిల్​ తాజాగా గుజరాత్​ టైటాన్స్​ జట్టుకు కెప్టెన్​గా పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో గిల్​ ఓ స్పెషల్ వీడియోలో మాట్లాడాడు. అయితే తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Shubman Gill Gujarat Titans
Shubman Gill Gujarat Titans
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 8:45 PM IST

Updated : Nov 29, 2023, 10:53 PM IST

Shubman Gill Gujarat Titans : యంగ్​ ప్లేయర్​ శుభ్​మన్​ గిల్​కు గుజరాత్​ టైటాన్స్​ ఫ్రాంచైజీ కొత్త పగ్గాలను అప్పజెప్పింది. హార్దిక్ పాండ్యా తర్వాత ఆ జట్టు సారథిగా గిల్​ను నియమించింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్​మెంట్​ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ స్వీకరించిన తర్వాత గిల్‌ తనకు అందిన ఈ రోల్​ గురించి ఓ స్పెషల్ వీడియోలో మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను గుజరాత్ టైటాన్స్‌ ఫ్రాంచైజీ.. తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అయితే అందులో గిల్‌ చేసిన కొన్ని కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. జట్టు కోసం కష్టపడి పనిచేయడం ముఖ్యమని, అందులో లాయల్టీ (విధేయత) కూడా ఒకటని గిల్ అన్నాడు. గిల్ ఆ పదాన్ని ఉపయోగించిన వెంటనే నెటిజన్లు.. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హార్దిక్​ను ట్రోల్ చేయడం మొదలెట్టారు.

"ఐపీఎల్‌లో ఆడటం అనేది ప్రతి ప్లేయర్ కల. నాకు 7-8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఐపీఎల్​ సీజన్​ మొదలైంది. ఇప్పుడు ఆ లీగ్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం అనేది నాకు పెద్ద విషయం. కెప్టెన్సీకి క్రమశిక్షణ, కృషి, విధేయత చాలా అవసరం. నేను చాలా మంది పెద్ద కెప్టెన్ల జట్లలో ఆడాను. వారి నుంచి నేను నేర్చుకున్నది ఈ ఐపీఎల్‌లో నాకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను" అని గిల్‌ చెప్పుకొచ్చాడు. అయితే గిల్​ చేసిన వ్యాఖ్యలు హార్దిక్​కు ఉద్దేశించినవి కానప్పటికీ.. ఫ్యాన్స్​ మాత్రం నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు.

  • 😍 From a dreamy eyed fanboy of the IPL to a captain of the Gujarat Titans! Aapdo Shubman is raring to own his latest designation! Hear his first words from a brand new chapter... 💙#TitansFAM, ready for a new era of leadership? 💙#AavaDe pic.twitter.com/vmIN7I4LQY

    — Gujarat Titans (@gujarat_titans) November 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరోవైపు గిల్​కు కెప్టెన్సీ ఇవ్వడం పట్ల చాలామంది ప్లేయర్లు నెట్టింట తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మహమ్మద్ షమీ కేన్ విలియమ్సన్​, డేవిడ్ మిల్లర్, వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉండగా గిల్‌ను ఎలా కెప్టెన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.

'కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకున్నారన్న విషయం తెలియగానే.. అతడికే కెప్టెన్సీ పగ్గాలను ఇస్తారని అనుకున్నాను. తను కెప్టెన్సీ అనుభవం కూడా ఉన్న ఓ అద్భుతమైన ప్లేయర్. గిల్‌కు ముందుగా భారత క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే టైమ్​ అయినా ఇవ్వాలి కదా. అలాగే ఐపీఎల్‌లో ఇంకో మంచి సీజన్​ను కూడా ఆడనివ్వాల్సింది' అంటూ తన అభిప్రాయాన్నివివరించాడు.

శుభ్​మన్​కు ప్రమోషన్​ - గుజరాత్ కొత్త కెప్టెన్​గా గిల్

ICC ODI Ranking 2023 : టాప్​ ప్లేస్​కు అతిదగ్గరలో గిల్-సిరాజ్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ రిలీజ్

Last Updated : Nov 29, 2023, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.