ETV Bharat / sports

టీవీ షోలో మాజీ క్రికెటర్​కు అవమానం.. ఉద్యోగానికి రాజీనామా​ - t20 world cup 2021

పాకిస్థాన్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​కు(Shoaib Akhtar news) ఓ టీవీ ఛానెల్​ ప్రోగ్రామ్​లో చేదు అనుభవం ఎదురైంది. షో మధ్యలోనే బయటకు వెళ్లిపోవాలని హోస్ట్​ చెప్పాడు. దీంతో బయటకు వచ్చేసిన అక్తర్..​ క్రికెట్ విశ్లేషకుడిగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు.

Shoaib Akhtar
షోయబ్​ అక్తర్​
author img

By

Published : Oct 27, 2021, 11:57 AM IST

పాకిస్థాన్​ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్​కు(Shoaib Akhtar news) ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఘోర అవమానం జరిగింది. ఆ దేశ అధికారిక పీవీటీ ఛానెల్​లో ఓ కార్యక్రమానికి అక్తర్​ అతిథిగా హాజరయ్యాడు. షో జరుగుతుండగా మధ్యలోనే షోయబ్​ను నిష్క్రమించాలంటూ హోస్ట్​ అసహనం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ నుంచి బయటకు వచ్చేసిన అక్తర్​.. తను చేస్తున్న క్రికెట్​ విశ్లేషకుడు ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. హోస్ట్​ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అవమానించాడని అక్తర్​ అన్నాడు.

అసలేం జరిగిందంటే?

టీ20 ప్రపంచకప్‌లో(T20 world cup 2021) భాగంగా మంగళవారం(అక్టోబరు26) జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్‌పై(T20 world cup 2021 pak vs new zealand) పాక్​​ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్​ తర్వాత పీటీవీ నిర్వహించిన షోకు అక్తర్​ గెస్ట్​గా హాజరయ్యాడు. అతనితో పాటు సర్​ వివియన్​ రిచర్డ్స్​, డేవిడ్​ గోవర్​, రషీద్​ లతీఫ్​, ఉమర్ గుల్​, రషీద్​ లతీఫ్​, ఆకిబ్ జావేద్​, పాక్​ మహిళల జట్టు మాజీ కెప్టెన్​ సనా మీర్​ పాల్గొన్నారు.

షో జరుగుతున్న క్రమంలో హోస్ట్​ నోమన్​ నియాజ్​​.. అక్తర్​ను ఓ ప్రశ్న అడిగాడు. అయితే అక్తర్​ దానిని విస్మరించి, పేసర్​ హరిస్​ రవూఫ్​ గురించి మట్లాడాడు. పాకిస్థాన్ సూపర్​ లీగ్​ ఫ్రాంచైజీ లాహోర్​ ఖలందర్స్​, దాని కోచ్​ ఆకీబ్​పై గురించి చెబుతూ.. హరిస్​ను వెలుగులోకి తీసుకొచ్చారని ప్రశంసించాడు.

దీంతో అసలు సమస్య మొదలైంది. అక్తర్​కు అసలు విషయం గురించి మాట్లాడాలని పదేపదే నియాజ్​ చెప్పినా వినలేదు. విసుగు చెందిన ​నియాజ్​.. షోయబ్‌తో తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని దానిని సహించనని, అలాంటి పరిస్థితుల్లో అతను షో నుంచి నిష్క్రమిస్తే.. కమర్షియల్ బ్రేక్ కోసం వెళ్లడం మంచిదన్నాడు. దీంతో అక్తర్​.. లేచి మైక్రోఫోన్​​ తీసేసి వెళ్లిపోయాడు. అయితే హోస్ట్​ నియాజ్​.. అక్తర్​ను తిరిగి పిలవడానికి గానీ, సముదాయించడానికి గానీ ప్రయత్నించలేదు. షోను మామూలుగా కొనసాగించాడు. దీంతో మిగతా గెస్ట్​లంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ వ్యవహారానికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా(Shoaib Akhtar latest video ) మారాయి. దీంతో అక్తర్​పై సానుభూతి వ్యక్తం చేసిన నెటిజన్లు.. పీటీవీ హోస్ట్​ స్పోర్ట్​ హోస్ట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: 'పాక్​ ఫ్యాన్స్​కు కోహ్లీ కంటే రోహిత్​ అంటేనే ఎక్కువ ఇష్టం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.