Shane Dowrich International Retirement : వెస్టిండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్ ఆ దేశ క్రికెట్ బోర్డుకు గట్టి షాక్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఈ రిటైర్మెంట్ వెంటనే అమల్లోకి వస్తుందని అతడు తెలిపాడు. అయితే డౌరిచ్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో విండీస్ బోర్డు సభ్యులు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే డిసెంబర్ 3 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ జట్టులో ఇతడికి తుది జట్టులో స్థానం కల్పించారు.
Shane Dowrich Stats : 32 ఏళ్ల షేన్ డౌరిచ్.. 2005లో టెస్ట్ ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 35 టెస్ట్‌లు, ఒక వన్డే ఆడాడు. టెస్టుల్లో మొత్తం 1570 పరుగులు చేశాడు. ఇందులో 3 శతకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇతడి ఫీల్డింగ్‌కు ప్రత్యర్థి బ్యాటర్లు సైతం హడలెత్తిపోతుంటారు. ఇప్పటిదాకా 91 వికెట్లు పడగొట్టాడు డౌరిచ్.
West Indies Vs England : ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్‌లో భాగంగా 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. కరీబియన్ జట్టు ఆతిథ్యమిస్తున్న ఈ సిరీస్‌లు డిసెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. 3, 6, 9 తేదీల్లో వన్డేలు.. 12, 14, 16, 19, 21 తేదీల్లో టీ20లు జరుగనున్నాయి. ఇక ఈ టూర్లో భాగంగా జరిగే వన్డే సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ తుది జట్ల జాబితాను విడుదల చేశాయి.
విండీస్ బలగం..
షేన్ డౌరిచ్, రొమారియో షెపర్డ్, యాన్నిక్ కారయ, ఒషేస్ థామన్, మాథ్యూ ఫోర్డ్, అల్జరీ జోసఫ్, గుడకేశ్ మోటీ, షేఫాన్ రూథర్‌ఫోర్డ్, షాయ్ హోప్ (కెప్టెన్), రోస్టన్ ఛేజ్, అలిక్ అథాంజే, కీసీ కార్టీ, షిమ్రోన్ హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, జోన్ ఓట్లీ
ఇంగ్లిష్ టీమ్..
మాథ్యూ పాట్స్, జాన్ టర్నర్, బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్‌లీ, అట్కిన్సన్, ఫిలిప్ సాల్ట్, ఓలీ పోప్, జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, లివింగ్‌స్టోన్, లియామ్, సామ్ కర్రన్, హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, విల్ జాక్స్
డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషన్స్ - ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ట్విస్ట్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్ - 'నేను ఇంకా సంతకం చేయలేదు'