Shadab Khan On Babar Azam : పాకిస్థాన్ క్రికెట్ జట్టులో విభేదాలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. కెప్టెన్ బాబర్ అజామ్‌తో జట్టులోని మిగతా ప్లేయర్లకు విభేధాలు వస్తున్నాయని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఆసియాకప్-2023 లీగ్ దశలో మంచిగా రాణించిన పాకిస్థాన్.. సూపర్-4లో ఓటమితో అనుహ్యంగా టోర్నీ నుంచి వైదొలిగింది. అయితే ఈ టోర్నీలో కెప్టెన్‌గా బాబర్ అజామ్ తీసుకున్న నిర్ణయాలపై కొంత మంది ప్లేయర్స్ ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
డ్రెస్సింగ్ రూమ్‌లో రెండు వర్గాలు.. పాక్ జట్టు డ్రెసింగ్ రూమ్‌లో రెండు వర్గాలు ఉన్నాయని అంటున్నారు. కొంతమంది బాబర్ కెప్టెన్సీని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారని వార్తల వస్తున్నాయి. లంకపై ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో బాబర్ - స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ కూడా బాబర్‌కు వ్యతిరేకంగా ఉన్నాడట.
Shadab Khan Statement : ఇక బాబర్‌పై పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ కూడా అసంతృప్తిగా ఉన్నట్లు కీలక వ్యాఖ్యలు చేశాడు. "ఫీల్డ్‌లో బాబర్ అజామ్‌తో ఆనందంగా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే అతడు మైదానంలో పూర్తి భిన్నంగా ఉంటాడు. కానీ ఆఫ్ ది ఫీల్డ్‌లో మాత్రం అతడితో మేము బాగానే ఉంటాం" అని షాదాబ్ పేర్కొన్నట్లు ఇంగ్లీష్ కథనాలు పేర్కొంటున్నాయి.
అయితే కెప్టెన్ బాబర్‌పై షాదాబ్ బహిరంగంగా చేసిన ఈ కామెంట్స్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతడిని తప్పించాలని అనుకుంటుందట. త్వరలో జరగనున్న పీసీబీ బోర్డు మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Pakisthan ODI Rankings : ఇక వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు విషయంలో మార్పులు రావొచ్చు. వచ్చే వారం ఆ జట్టు నంబర్‌వన్ ర్యాంకును కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇక వరల్డ్ కప్ వరకు పాక్ వన్డే మ్యాచ్‌లు ఆడకపోవడం ఇందుకు కారణం. సెప్టెంబరు 22 నుంచి టీమ్‌ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలు కానుంది. దీంతో ఈ సిరీస్‌లో ఆధిపత్యం చూపించిన టీమ్ నంబర్‌వన్ ర్యాంక్‌కు దూసుకెళ్తుంది. ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా సొంతం చేసుకుంటే.. మూడు ఫార్మాట్లలో నంబర్‌వన్ టీమ్‌గా భారత్ అవతరిస్తుంది. ఇప్పటికే టీ20లు, టెస్టుల్లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌గా ఉంది.
- — Pakistan Cricket (@TheRealPCB) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2023
">— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2023
Pak Vs SL Asia Cup 2023 : సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ఓటమి.. లంకతోనే భారత్ అమీతుమీ..
Asia Cup 2023 Pakistan : పాక్‌కు మరో షాక్.. రానున్న మ్యాచ్‌లకు ఆ స్టార్ పేసర్లు దూరం