కెప్టెన్సీ విషయంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), సర్ఫరాజ్ అహ్మద్(Sarfaraz Ahmed) ఒకేలా వ్యవహరిస్తారని.. దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ తెలిపాడు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్(Pakisthan cricket league)లో భాగంగా సర్ఫ్రాజ్ నేతృత్వంలోని క్వెట్టా గ్లాడియేటర్స్‌కు డుప్లెసిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో సీఎస్కే తరఫున ఆడుతున్నాడు.
క్రికెట్ పాకిస్థాన్ నిర్వహించిన ఓ ముఖాముఖిలో.. ధోనీ, సర్ఫ్రాజ్ కెప్టెన్సీల గురించి అడగగా.. ఈ విధంగా స్పందించాడు డుప్లెసిస్(Faf Du Plesis). "వారిద్దరి నాయకత్వ శైలి వేర్వేరుగా ఉంటుంది. ధోనీ(MS Dhoni) నిశబ్దంగా తన పని తాను చేసుకుపోతాడు. కానీ, సర్ఫ్రాజ్ అలా కాదు. కోహ్లీలా నిరంతరం ఆటగాళ్లతో, బౌలర్లతో మాట్లాడుతుంటాడు. తన జట్టును ఎలా నడిపించాలనే విషయంపై మక్కువ చూపిస్తుంటాడు" అని తెలిపాడు.
విభిన్న నాయకుల కింద ఆడటం తనకిష్టమని డుప్లెసిస్ వెల్లడించాడు. వారు తమ జట్లను ఎలా నడిపిస్తున్నారో తెలుసుకోవచ్చన్నాడు. అలాగే సర్ఫ్రాజ్ కూడా తనదైన శైలిలో టీమ్‌ను ముందుండి నడిపిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్(Babar Azam) గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఈ ప్రోటీస్ క్రికెటర్. అతడు ఫీల్డ్‌లో చాలా ప్రశాంతంగా కనిపిస్తాడని చెప్పాడు. అతనితో కలిసి ఆడిన సందర్భాలు చాలా తక్కువని తెలిపాడు. కానీ, అతడి ఆటతీరుకు అభిమానులు ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు.
కరోనా కారణంగా వాయిదా పడిన పీఎస్ఎల్(PSL) రెండో దశ.. తిరిగి జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు డుప్లెసిస్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది క్వెట్టా.
ఇదీ చదవండి: NZ vs ENG: 'తొలి టెస్టులో ఫలితం రావడం పక్కా'