ETV Bharat / sports

ట్రాఫిక్​ పోలీస్​కు థ్యాంక్స్​ చెప్పిన సచిన్​.. ఎందుకంటే? - సచిన్​ తెందూల్కర్

Sachin Tendulkar Thanks Police: టీమ్​ఇండియా దిగ్గజం సచిన్​ తెందుల్కర్.. ఓ ట్రాఫిక్​ పోలీస్​కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి వారివల్లే ప్రపంచం అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ సంఘటనను షేర్​ చేశారు మాస్టర్​ బ్లాస్టర్​​. మరి ఆ కథేంటి?

Sachin Tendulkar
సచిన్​ తెందూల్కర్
author img

By

Published : Dec 17, 2021, 8:16 PM IST

Sachin Tendulkar Thanks Police: దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్​ సచిన్​ తెందుల్కర్​ మరోసారి ఉదారతను చాటుకున్నారు. రోడ్డుప్రమాదానికి గురైన తన స్నేహితురాలి ప్రాణాలను కాపాడినందుకు ఓ ట్రాఫిక్ పోలీస్​కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇలాంటి వారివల్లే.. ప్రపంచం అద్భుతంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఈ సంఘటనను ఫ్యాన్స్​తో షేర్​ చేసుకున్నారు.

"కొన్నిరోజుల క్రితం నాకు అత్యంత దగ్గరైన ఓ స్నేహితురాలు ఘోరమైన రోడ్డుప్రమాదానికి గురైంది. దేవుడి దయవల్ల ఆమె ప్రస్తుతం కోలుకుంటోంది. ఓ ట్రాఫిక్​ పోలీస్​ సరైన సమయంలో స్పందించడం వల్ల ఆమె ప్రాణాలు నిలబడ్డాయి. ఆ ట్రాఫిక్​ పోలీస్.. ఓ ఆటోలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డ్యూటీకి మించి ఆ పోలీస్.. చేసిన సహాయానికి నేను కృతజ్ఞతలు చెబుతున్నాను" అని ట్విట్టర్​లో తెలిపారు సచిన్.

తాను ఆ పోలీస్​ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు చెప్పినట్లు సచిన్​ చెప్పారు. ఇలాంటి వారివల్లే ప్రపంచం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులందరినీ కొనియాడారు. ప్రజలంతా ట్రాఫిక్​ రూల్స్ పాటించాలని, షార్ట్​కట్స్​లో వెళ్లొద్దని సూచించారు.

ఇదీ చూడండి: Ganguly on Sachin: టీమ్​ఇండియాకు సచిన్​ సేవలు.. గంగూలీ హింట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.