ETV Bharat / sports

సిరాజ్​ కాళ్లలో స్ప్రింగ్​లు ఉంటాయి: సచిన్​ - teamindia vs southafrica test series

Sachin Tendulkar praises Mohammed Siraj: టీమ్​ఇండియా పేసర్ మహ్మద్​ సిరాజ్​పై ప్రశంసలు కురిపించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​. అతడెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అద్భుతమైన ఆటగాడని కితాబిచ్చాడు.

Sachin Tendulkar praises Mohammed Siraj
సిరాజ్​ సచిన్​
author img

By

Published : Dec 22, 2021, 9:00 PM IST

Sachin Tendulkar praises Mohammed Siraj: హైదరాబద్​ పేసర్​ మహ్మద్​ సిరాజ్​ను దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ ప్రశంసించాడు. అతడిని చూసిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుందని కొనియాడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాస్టర్..​ ఈ వ్యాఖ్యలు చేశాడు.

"అతడి కాళ్లలో స్ప్రింగ్​లు ఉంటాయి. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడు. ఎనర్జీగా ఉంటాడు. అతడు చేసేది తొలి ఓవరా లేదా ఆఖరిదా అన్నది గుర్తించలేం. ఈ లక్షణాలు నాకెంతో ఆకట్టుకున్నాయి. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ఆడాడు. అతడిలో వేగంగా నేర్చుకునే లక్షణం ఉంది. అరంగేట్ర టెస్టులోనే అనుభవజ్ఞుడిలా ఆడాడు"

-సచిన్​ తెందుల్కర్​.

తనపై సచిన్​కు ఉన్న అభిప్రాయానికి సిరాజ్​ కృతజ్ఞతలు చెప్పాడు. "థ్యాంక్యూ సచిన్​ సర్​. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను" అని అన్నాడు. ప్రస్తుతం టీమ్​ఇండియా.. మూడు టెస్టుల సిరీస్​ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. సిరాజ్​ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు.

ఇదీ చూడండి: సిరాజ్​ను కొట్టిన రోహిత్ శర్మ!.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.