వెస్టిండీస్‌తో తొలి టీ20లో రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీని అధిగమించాడు రోహిత్. 3237 రన్స్ సాధించి టీ20లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే కోహ్లీ, 3244 పరుగుల మార్క్ అందుకుని తన రెండో స్థానాన్ని మళ్లీ దక్కించకున్నాడు.
టీ20లో 120 మ్యాచ్‌లు ఆడి రోహిత్.. ప్రస్తుతం 3237 పరుగలతో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 50 అర్థసెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మార్టిన్ గప్తిల్ 3299 రన్స్‌తో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ కోహ్లీ 96 టీ20ల్లో 3244 పరుగులతో ఉన్నాడు. ఇందులో 29 అర్థసెంచరీలు, 290 ఫోర్లు, 91 సిక్స్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: IND vs WI T20: టాస్ గెలిచిన భారత్.. వెస్టిండీస్ బ్యాటింగ్