ETV Bharat / sports

రాబిన్​సన్​పై ఈసీబీ కనికరం..నిషేధం వాయిదా - ఇంగ్లాండ్

జాత్యహంకార పోస్టులతో నిషేధానికి గురైన ఇంగ్లాండ్ బౌలర్​ ఓలీ రాబిన్​సన్​ రోజుల వ్యవధిలోనే తిరిగి దేశం తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్, వేల్స్​ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

Robinson
రాబిన్​సన్
author img

By

Published : Jul 3, 2021, 9:49 PM IST

వివాదాస్పద ఇంగ్లాండ్ పేసర్​ ఓల్లీ రాబిన్​సన్​కు అనూహ్య ఉపశమనం లభించింది. స్త్రీ వివక్ష, జాత్యహంకార పోస్టుల కారణంగా నిషేధం విధించిన ఇంగ్లాండ్, వేల్స్​ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. అంతలోనే అతడిపై కనికరం చూపింది. దీంతో భారత్​తో జరగబోయే ఐదు మ్యాచ్​ల టెస్టు సిరీస్​కు అతడు అందుబాటులో ఉండనున్నాడు.

ఇదీ ఈసీబీ వివరణ..

"రాబిన్​సన్​ విద్వేషపూరిత ట్వీట్లపై దర్యాప్తు జరిపిన క్రమశిక్షణ కమిషన్ ప్యానెల్ అతడిపై రూ.3.30లక్షల జరిమానా సహా 8 మ్యాచ్​ల నిషేధం విధించింది. వాటిలో ఐదింటిని రెండేళ్లపాటు వాయిదా వేసింది. మిగిలిన 3 మ్యాచ్​ల సస్పెన్షన్​ను వెంటనే అమలు చేయాలని చెప్పింది. అయితే దర్యాప్తు కారణంగా న్యూజిలాండ్​తో రెండో టెస్టు, సస్సెక్స్​ టీ20లో రెండు మ్యాచ్​లకు అతడు దూరంగా ఉండటాన్ని శిక్ష అనుభవించినట్లుగానే ప్యానెల్​ భావించింది. దీంతో అతడు తక్షణం ఇంగ్లాండ్​ తరఫుడు ఆడేందుకు అర్హుడు" అని ఈసీబీ శనివారం వెల్లడించింది.

ఇవీ చూడండి:

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్​సన్​ సస్పెండ్

Controversial Tweet: ట్వీట్ చేశారు.. చిక్కుల్లో పడ్డారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.