ETV Bharat / sports

స్టంపౌట్​ చేశాడని రిజ్వాన్​ను​ బ్యాట్​తో కొట్టబోయిన బాబర్!-​ వీడియో చూశారా? - pakistan tour of australia team

Rizwan Babar Azam Viral Video : ఓ మ్యాచ్​ సందర్భంగా పాకిస్థాన్​ ప్లేయర్​ రిజ్వాన్​ను ఆ జట్టు మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ బ్యాట్​తో కొట్టబోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

Rizwan Babar Azam Viral Video
Rizwan Babar Azam Viral Video
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 5:21 PM IST

Updated : Nov 26, 2023, 7:24 PM IST

Rizwan Babar Azam Viral Video : పాకిస్థాన్​ ప్లేయర్ మహ్మద్​ రిజ్వాన్​ను ఆ జట్టు మాజీ సారథి బాబర్​ అజామ్​ బ్యాట్​తో కొట్టబోయాడు. బ్యాట్​ పట్టుకుని రిజ్వాన్​ వెంట పరుగెత్తాడు. దీన్ని గమనించిన రిజ్వాన్.. పరుగు అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇదీ జరిగింది..
ఇటీవల ముగిసిన 2023 వన్డే వరల్డ్​ కప్​లో పాక్​ జట్టు పేలవ ప్రదర్శన చేసి గ్రూప్​ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో కెప్టెన్​గా బాబర్​ అజామ్​​ స్థానంలో షాన్​ మసూద్​ను నియమించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు. షాన్​ సారథ్యంలో ఆస్ట్రేలియా వేదికగా ఆ జట్టు మూడు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​ ఆడనుంది. డిసెంబర్​ 14న ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటికే పీసీబీ జట్టును కూడా ప్రకిటించింది.

ఆ జట్టు ఇప్పటినుంచే ప్రాక్టీస్ ప్రారంభించింది. లాహోర్​లో ప్లేయర్లు ప్రాక్టీస్​ చేస్తున్న సందర్భంగా ఓ సరదా ఘటన జరిగింది. పాక్​ వికెట్ కీపర్ రిజ్వాన్‌ను మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ సరదగా బ్యాట్‌తో కొట్టబోయాడు. ఇంట్రా స్క్వాడ్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ఓ మ్యాచ్​ జరిగింది. అందులో ఓవర్‌ పూర్తి అయిందని బాబర్‌ క్రీజును వదిలి ముందుకు వెళ్లాడు. ఇంతలో వికెట్ల వెనుక ఉన్న రిజ్వాన్‌ స్టంప్స్‌ను పడగొట్టాడు. అనంతరం రనౌట్‌కు అప్పీల్‌ చేశాడు. ఇది గమనించిన బాబర్.. బ్యాట్​తో రిజ్వాన్​ను కొట్టేందుకు అతడి వైపు పరుగెత్తాడు. అది చూసి రిజ్వాన్​ కూడా పరుగుతీశాడు. కాగా ఈ సరదా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఆస్ట్రేలియా టెస్ట్​ సిరీస్​కు పాకిస్థాన్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్​, ఫహీమ్ అష్రఫ్, హసన్ అలీ, ఇమామ్-ఉల్-హక్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్ వాసిమ్ జూనియర్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, షాహీన్ షా ఆఫ్రిది

పాకిస్థాన్​ టూర్​ ఆఫ్​ ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్:

  • 1వ టెస్ట్ - పెర్త్ (2023 డిసెంబర్ 14 నుంచి 18 వరకు)
  • 2వ టెస్ట్ - మెల్​బోర్న్ (2023 డిసెంబర్ 26 నుంచి 30 వరకు)
  • 3వ టెస్ట్ - సిడ్నీ (2024 జనవరి 3 నుంచి 7 వరకు)

స్టంపౌట్​ చేశాడని రిజ్వాన్​ను​ బ్యాట్​తో కొట్టబోయిన బాబర్!-​ వీడియో చూశారా?

గుజరాత్​ జట్టులోనే హార్దిక్- ఐపీఎల్‌ 2024కు ముందు ఫ్రాంచైజీలు రిలీజ్​ చేసిన ప్లేయర్లు వీరే!

Last Updated : Nov 26, 2023, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.