ETV Bharat / sports

వేగంగా కోలుకుంటున్న పంత్​.. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి షిఫ్ట్ - పంత్​ ఆరోగ్యంపై సీఎం పుష్కర్​ సింగ్ ధామి

క్రికెటర్ రిషభ్​ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఓ అప్​డేట్​ వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు పంత్​ ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం అతడిని ఐసీయూ నుంచి ప్రత్యేకమైన గదికి మార్చారు. రిషబ్ పంత్ చాలా వేగంగా కోలుకుంటున్నాడని మ్యాక్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

Pant To General Ward
Rishab Pant
author img

By

Published : Jan 2, 2023, 10:53 AM IST

Updated : Jan 2, 2023, 12:27 PM IST

భారత యువ క్రికెటర్​ రిషభ్ పంత్​ ఆరోగ్యానికి సంబంధించి ఓ శుభవార్త వచ్చింది. రిషబ్ పంత్ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగు పడినట్లుగా వైద్యులు తెలిపారు. అతడిని ఐసీయు నుంచి ప్రత్యేకంగా కేటాయించిన గదికి మార్చినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనన్న ఆందోళనతో అతడిని ప్రత్యేక గదికి మార్చినట్లు తెలిపారు. ప్రస్తుతం దెహ్రాదూన్​లోని మ్యాక్స్​ ఆసుపత్రిలో పంత్​ చికిత్స పొందుతున్నాడు. కాగా, పంత్​ కాలికి లిగ్మెంట్‌ చికిత్స ఎక్కడ చేయించాలనేది బీసీసీఐ నిర్ణయం తీసుకొనుందని సమాచారం.

సీఎం పరామర్శ:
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం పంత్​ను పరామర్శించారు. పంత్​ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంత్​ కుటుంబ సభ్యులనూ కలిశారు. సుమారు గంటపాటు పంత్ తల్లి సరోజ్ పంత్, సోదరి సాక్షి పంత్​తో మాట్లాడారు. పంత్​ ఆరోగ్యం పట్ల ఆందోళన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పారు.

గుంతల కారణంగానే ఇలా జరిగింది: పంత్
అయితే, ఆదివారం పంత్​ను పరామర్శించిన ముఖ్యమంత్రి.. గుంతల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పంత్​ చెప్పాడని వివరించారు. ఈ సందర్భంగా పంత్​కు అందిస్తున్న చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. అతడికి మెరుగైన వైద్యం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

2022 డిసెంబర్​ 30న దిల్లీ నుంచి రూర్కీలోని తన ఇంటికి వెళ్లే సమయంలో రిషభ్​ పంత్​ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఉదయం 5 గంటలకు రూర్కీ సమీపంలోని నర్సన్ ప్రాంతంలో పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కారులో మంటలు కూడా వచ్చాయి. స్థానికులు రూర్కీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కోసం.. వైద్యులు అతడిని దెహ్రాదూన్​లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Jan 2, 2023, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.