Rishabh Pant Recovery Update: టీమ్ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయాల నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. గతేడాది డిసెంబర్ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన రిషబ్.. మూడు సర్జరీలు చేయించుకుని బెడ్ రెస్ట్‌లో ఉన్నాడు. ఆ తర్వాత కొద్ది నెలల పాటు ఇంట్లోనే ఉన్న పంత్.. నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తన ఫ్యాన్స్ కోసం అప్పడప్పుడు తన హెల్త్ అప్డేట్ ఇన్తూ వచ్చాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రిహబిలిటేషన్‌లో ఉన్నాడు.
Rishabh Pant NCA : ఈ క్రమంలో తాజాగా అతను నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. గంటలకు 140 కి.మీ.కిపైగా వేగంతో విసిరే బంతులను కూడా పంత్ ఎదుర్కొంటున్నాడట. అయితే ఇప్పట్లో ప్రొఫెషనల్ క్రికెట్లోకి తిరిగొచ్చేంత ఫిట్‌నెస్ మాత్రం సాధించలేదని వైద్యులు చెప్తున్నారు. అయితే అతను మాత్రం ఏమాత్రం పట్టు వదలకుండా క్రీజులో అవసరమైనట్లుగా తన శరీరాన్ని మెల్లగా కదిలించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో అతని రికవరీ చూసి ఎన్సీఏ సిబ్బంది కూడా ఆశ్చర్యపోతున్నారు. దీంతో సాధ్యమైనంత త్వరగానే పంత్ తిరిగి క్రికెట్లో అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
"రిషబ్ రికవరీ మెరుగ్గా ఉంది. గంటకు సుమారు 140 కి.మీ.కు పైగా వేగంతో విసిరే బంతులను సైతం అతడు ఎదుర్కొంటున్నాడు. తన రికవరీలో వస్తున్న ప్రతి అడ్డంకిని పంత్ అధిగమించడం చూస్తుంటే మాకు సంతోషంగా ఉంది. అతడు బాగున్నాడు. ఇక శరీరాన్ని వేగంగా అటూ ఇటూ కదిలించడమే అతని తర్వాతి లక్ష్యం. వచ్చే రెండు నెలల్లో ఈ విషయంపై దృష్టి సారిస్తాం" అంటూ ఎన్సీఏ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
రాహుల్, శ్రేయస్ కూడా..
Shreyas Iyer NCA : మరోవైపు గాయాలతో క్రికెట్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కూడా ఫిట్‌నెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా నేషనల్ క్రికెట్ అకాడమీలోనే ఉన్నారు. ఓ వైపు విశ్రాంతి తీసుకుంటూనే మరోవైపు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే వీరిద్దరూ ఇంకా అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టేంత ఫిట్‌నెస్ సాధించలేదు.
-
Starting to feel like me again 🏃♂️🏟️ pic.twitter.com/8cECI7oRDZ
— K L Rahul (@klrahul) July 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Starting to feel like me again 🏃♂️🏟️ pic.twitter.com/8cECI7oRDZ
— K L Rahul (@klrahul) July 11, 2023Starting to feel like me again 🏃♂️🏟️ pic.twitter.com/8cECI7oRDZ
— K L Rahul (@klrahul) July 11, 2023
KL Rahul NCA : మరోవైపు ఆసియా కప్ టైమ్‌కు రాహుల్ కోలుకునే అవకాశాలు కనిపిస్తునప్పటికీ.. శ్రేయస్ మాత్రం మరికాస్త ఎక్కువ సమయం తీసుకోనున్నాడు. అయితే వీళ్లిద్దరూ ఆసియా కప్ సమయానికి అందుబాటులోకి వస్తారని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ వీరిద్దరూ అందుబాటులోకి రాకపోతే సంజూ శాంసన్, సూర్యకుమార్‌లు వీరి స్థానాల్లో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.