ETV Bharat / sports

Rewind 2021: చారిత్రక విజయాలు.. అద్వితీయ రికార్డులు

author img

By

Published : Dec 31, 2021, 9:17 AM IST

Rewind 2021 Sports: టీమ్ఇండియా అదిరిపోయే విజయాలు.. ఒలింపిక్స్​లో వ్యక్తిగత స్వర్ణంతో నీరజ్ చోప్రా చరిత్ర.. రెండు ఒలింపిక్స్ పతకాలతో పీవీ సింధు రికార్డు.. బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్​లో కిదాంబి శ్రీకాంత్ రజతం.. ఇలా ఈ ఏడాది భారత క్రీడల్లో జరిగిన అపూర్వ ఘట్టాలపై ఓ లుక్కేద్దాం.

India 2021 sports, టీమ్ఇండియా క్రీడలు 2021
India 2021

Rewind 2021 Sports: కోట్లాది హృదయాలు గర్వంతో ఉప్పొంగిన క్షణాలు! ఆవేదనతో తడిసిన క్రికెట్‌ ప్రేమికుల మనసులు! కన్నీళ్లు పెట్టించిన ఓటములు.. తలెత్తుకునేలా చేసిన విజయాలు! నింగికి ఎగిసిన దిగ్గజాలు.. ఎప్పటికీ నిలిచిపోయే ప్రదర్శనలు! ఆందోళన కలిగించిన వివాదాలు.. ఆనందంలో ముంచిన సంచలనాలు! ఇలా ఈ ఏడాదిలో ఎన్నెన్నో జ్ఞాపకాలు. పదిలంగా పది కాలల పాటు దాచుకునేవి కొన్ని.. ముందుకు సాగేందుకు మరిచిపోయేవి మరికొన్ని! కాలగర్భంలో కలిసిపోతున్న 2021లో క్రీడల్లో కొన్ని ముఖ్య పరిణామాలను ఓసారి నెమరు వేసుకుందాం!

అద్భుతం

నీరజ్ చోప్రా రికార్డు, neeraj chopra record
నీరజ్ చోప్రా

Neeraj Chopra Record: కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్‌ 2021లో జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగాయి. ఈ క్రీడలు ముగింపు దిశగా సాగుతున్న సమయమది.. అప్పటికే భారత అథ్లెట్లు మంచి ప్రదర్శనే చేశారు కానీ పసిడి మాత్రం దక్కలేదు. ఇక మిగిలింది అథ్లెటిక్స్‌ మాత్రమే కావడం వల్ల మరోసారి స్వర్ణం లేకుండానే మన అథ్లెట్లు తిరిగి వస్తారేమోనని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి అంచనాలు లేని అథ్లెటిక్స్‌లో అది కూడా జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా అద్భుతమే చేశాడు. ఈటెను ఏకంగా 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం పట్టేశాడు. స్వతంత్ర భారతావనికి అథ్లెటిక్స్‌లో తొలి పతకం అందించడమే కాకుండా మొట్టమొదటి పసిడి సాధించి చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా 24 ఏళ్ల నీరజ్‌ చరిత్ర పుటల్లోకెక్కాడు.

PV Sindhu Record: అలాగే బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో కాంస్యం సాధించిన మన పీవీ సింధు.. రెండు ఒలింపిక్స్‌ పతకాలు (2016లో రజతం) దక్కించుకున్న తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు నమోదు చేసింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పురుషుల హాకీ జట్టు పతకం (కాంస్యం) గెలిచింది. మహిళల హాకీ జట్టు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి, రెజ్లింగ్‌లో రవి కుమార్‌ రజతాలు, బాక్సింగ్‌లో లవ్లీనా, మరో రెజ్లర్‌ బజ్‌రంగ్‌ కాంస్యాలు నెగ్గడం వల్ల మొత్తం ఏడు పతకాలతో ఒలింపిక్స్‌ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనతో భారత్‌ పోటీలను ముగించింది.

పీవీ సింధు రికార్డు, PV Sindhu record
పీవీ సింధు

ఇక అదే వేదికగా జరిగిన పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు దుమ్ములేపారు. వైకల్యాలను అధిగమించి పతకాల పంట పండించారు. ఐదు స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక పారాలింపిక్స్‌లో దేశానికి దక్కిన అత్యధిక పతకాలివే. అవని, మనీశ్‌ (షూటింగ్‌), సుమిత్‌ (జావెలిన్‌ త్రో), ప్రమోద్‌, కృష్ణ నాగర్‌ (బ్యాడ్మింటన్‌) చెరో పసిడి నెగ్గారు.

అపూర్వం

టీమ్ఇండియా చారిత్రక విజాయలు, team india historical wins
టీమ్ఇండియా

ఆస్ట్రేలియాను దాని దేశంలో ఓడించడం అంత సులువు కాదు. అలాంటిది వరుసగా రెండుసార్లు కంగారూలను దాని సొంతగడ్డపైనే టెస్టు సిరీస్‌ల్లో చిత్తు చేయడమంటే మామూలు విషయం కాదు. అందులోనూ జట్టులోని కొంతమంది ప్రధాన ఆటగాళ్లు దూరమైనా విజయం సాధించడమంటే అద్భుతమే. ఆ అద్భుతాన్ని అందుకుంది టీమ్‌ఇండియా. 2020-21 బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌటై అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. ఆ టెస్టు తర్వాత కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. కానీ సారథ్యంలో పుంజుకున్న జట్టు రెండో టెస్టులో గెలిచింది. మూడో మ్యాచ్‌ డ్రా అయింది. ఇక జనవరిలో గబ్బాలో చివరి టెస్టుకు వచ్చేసరికి గాయాల కారణంగా జట్టులో ప్రధాన పేసర్లెవరూ లేకుండా పోయారు. దీంతో సిరాజ్‌ బౌలింగ్‌ దళాన్ని నడిపించాల్సి వచ్చింది. ఆ టెస్టులో సుందర్‌, శార్దూల్‌, సిరాజ్‌, పంత్‌ వీరోచిత ప్రదర్శనతో ప్రత్యర్థిని ఓడించిన టీమ్‌ఇండియా.. 32 ఏళ్ల తర్వాత ఆ వేదికలో ఆతిథ్య జట్టుకు తొలి ఓటమి రుచి చూపించి సిరీస్‌ దక్కించుకుంది. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టులో విజయంతో 2021ను ఘనంగా ముగించింది.

సంచలనం

అజాజ్ పటేల్ రికార్డు, Azaj patel record
అజాజ్ పటేల్

Azaj patel Record: ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడాన్ని గొప్ప ప్రదర్శనగా చూస్తారు. అదే పదికి పది వికెట్లు తీస్తే సంచలనమే. ఈ ఏడాది ముందు వరకూ అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఇద్దరికి (జిమ్‌ లేకర్‌, అనిల్‌ కుంబ్లే) మాత్రమే అది సాధ్యమైంది. కానీ 2021లో భారత్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు.

ఏ క్రీడల్లోనైనా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒక్క పతకం సాధిస్తే ఆ ప్లేయర్‌ను ఆకాశానికెత్తేస్తాం. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పతకాలు గెలిస్తే.. అది కూడా ఒకే ఛాంపియన్‌షిప్‌లో నెగ్గింది.. మన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యుఎస్‌లో జరిగిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ కాంపౌండ్‌ విభాగంలో ఆమె వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌, మహిళల జట్టు విభాగాల్లో రజతాలు నెగ్గి ఆ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్‌గా నిలిచింది.

భారత్‌లో మహిళల క్రికెట్‌కు మారుపేరుగా నిలిచిన మిథాలీ రాజ్‌ ఈ ఏడాది ఓ గొప్ప రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న ఈ టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌.. తాజాగా అంతర్జాతీయ అమ్మాయిల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆమె ఎడ్వర్డ్‌ (10,273)ను అధిగమించింది. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 321 మ్యాచ్‌లాడిన ఆమె 10,454 పరుగులు చేసింది.

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ ఏడాది మరో సంచలనం నమోదు చేశాడు. ఆల్‌టైమ్‌ అత్యధిక అంతర్జాతీయ గోల్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈ పోర్చుగల్‌ ఆటగాడు 184 మ్యాచ్‌ల్లో 115 గోల్స్‌ చేశాడు. భారత కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి, మెస్సి చెరో 80 గోల్స్‌తో సంయుక్తంగా ఐదో స్థానంలో ఉన్నారు.

తాజాగా ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను వెనక్కినెట్టి ఛాంపియన్‌గా నిలిచిన 17 ఏళ్ల ఉజ్బెకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ నోడిర్బెక్‌ సంచలనం సృష్టించాడు. పదో రౌండ్లో కార్ల్‌సన్‌ను ఓడించిన ఈ టీనేజర్‌.. చివరి వరకూ అదే జోరుతో విజేతగా నిలిచాడు. ఈ టైటిల్‌ గెలిచిన అతి పిన్న వయస్సు ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

అద్వితీయం

2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిళ్లు సాధించిన కిదాంబి శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ భవిష్యత్‌ ఆశగా కనిపించాడు. కానీ ఆ తర్వాత గాయాలు, ఫామ్‌ లేమితో వెనకబడ్డాడు. టోక్యో ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించలేదు. కానీ ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మాత్రం అంచనాలకు మించి అద్వితీయమైన ఆటతో అదరగొట్టాడు. రజతం సొంతం చేసుకుని ఆ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదే టోర్నీలో 20 ఏళ్ల లక్ష్యసేన్‌ కాంస్యం సాధించడం విశేషం.

Kidambi srikanth record, కిదాంబి శ్రీకాంత్ రికార్డు
కిదాంబి శ్రీకాంత్

ప్రపంచ మహిళల టీమ్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు అదరగొట్టింది. హారిక, వైశాలి, తనియా, మేరీ గోమ్స్‌, భక్తి కులకర్ణితో కూడిన జట్టు ఈ ఏడాది రజతం సాధించి ఈ ఛాంపియన్‌షిప్‌ చరిత్రలో దేశానికి తొలి పతకం అందించింది. ఫైనల్లో భారత్‌ 0-2తో రష్యా చేతిలో ఓడింది. ఈ పతకం సాధించడంలో తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక కీలక పాత్ర పోషించింది. టోర్నీలో అజేయంగా నిలిచిన ఆమె వ్యక్తిగతంగానూ వెండి పతకం అందుకుంది. మరోవైపు ఈ ఏడాది ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం అందుకున్న జట్టులోనూ ఆమె సభ్యురాలు. అందులో మరో ఇద్దరు తెలుగు గ్రాండ్‌మాస్టర్లు హంపి, హరికృష్ణ కూడా ఉన్నారు.

ఆధిపత్యం

Ashes 2021: యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగింది. సొంతగడ్డపై కంగారూ జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి ఐదు టెస్టుల సిరీస్‌ సొంతం చేసుకుంది. 2017-18 సిరీస్‌లో యాషెస్‌ ట్రోఫీని తిరిగి దక్కించుకున్న జట్టు ఇప్పుడు దాన్ని తన దగ్గరే అట్టిపెట్టుకోనుంది.

ఈ ఏడాది టెన్నిస్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌దే ఆధిపత్యం. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లకు గాను మూడింట్లో అతను గెలిచాడు. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ అయిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో మొదలెట్టి ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌లో టైటిళ్లు గెలిచాడు. కానీ చివరిదైన యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో మెద్వెదెవ్‌ చేతిలో ఓడి రికార్డు సృష్టించే అవకాశం కోల్పోయాడు. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో 20 టైటిళ్లతో ఫెదరర్‌, నాదల్‌తో అతను సమానంగా ఉన్నాడు.

జకోవిచ్  రికార్డు, Djokovic
జకోవిచ్

ప్రపంచ చెస్‌లో తనకు తిరుగులేదని మరోసారి మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) చాటిచెప్పాడు. రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 2013 నుంచి ఆ టైటిల్‌ అతనిదే.

ఐపీఎల్‌లో గతేడాది పేలవ ప్రదర్శన చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లో తిరిగి సత్తాచాటింది. తన ఆధిపత్యాన్ని చాటుతూ విజేతగా నిలిచింది. ఫైనల్లో 27 పరుగుల తేడాతో కేకేఆర్‌పై గెలిచింది. లీగ్‌లో నాలుగో ట్రోఫీ సొంతం చేసుకున్న జట్టు.. అత్యధిక టైటిళ్లలో ముంబయి ఇండియన్స్‌ (5) తర్వాత రెండో స్థానంలో ఉంది.

అనూహ్యం

ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా గెలిచిన స్వర్ణం స్ఫూర్తితో అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత అథ్లెట్లు మెరిశారు. కెన్యాలో జరిగిన పోటీల్లో ఏకంగా మూడు పతకాలు కొల్లగొట్టారు. అమిత్‌ (10వేల కిలోమీటర్ల నడక), శైలి సింగ్‌ (లాంగ్‌జంప్‌) రజతాలు నెగ్గగా.. మిక్స్‌డ్‌ 4×400మీ రిలే జట్టు కాంస్యం సొంతం చేసుకుంది.

శైలి సింగ్ రికార్డు, shaili singh record
శైలి సింగ్

ఫార్ములావన్‌కు పర్యాయ పదంగా మారిన మెర్సిడెజ్‌ రేసర్‌ హామిల్టన్‌ (బ్రిటన్‌) ఈ ఏడాది ఎనిమిదో సారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి దిగ్గజం షుమాకర్‌ (7)ను దాటేద్దామనుకున్నాడు. కానీ అనూహ్యంగా రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్స్‌టాపెన్‌ (నెదర్లాండ్స్‌) టైటిల్‌ ఎగరేసుకుపోయాడు. వివాదాస్పదంగా ముగిసిన ఈ సీజన్‌ చివరి గ్రాండ్‌ ప్రి అబుదాబి రేసులో ఆఖరి ల్యాప్‌లో హామిల్టన్‌ను వెనక్కినెట్టి వెర్స్‌టాపెన్‌ విజేతగా నిలవడం విశేషం. అతనికిదే తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌.

ఇవీ చూడండి: గబ్బాలో మొదలై.. ప్రత్యర్థి విజయాలకు గండికొడుతూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.