ETV Bharat / sports

Rohit sharma captain: 'కెప్టెన్​గా రోహిత్​కు అదే పెద్ద సవాల్​'

Rohit Sharma team india: రోహిత్​ శర్మకు కెప్టెన్​గా అతిపెద్ద సవాల్ ఉందని చెప్పాడు​ టీమ్​ఇండియా మాజీ బౌలర్​ అజిత్​ అగార్కర్. దానిని అధిగమిస్తే రోహిత్​ రాణిస్తాడని పేర్కొన్నాడు. పరిమిత ఒవర్లకు ఒక్కరే కెప్టెన్​ ఉండాలనే నిర్ణయాన్ని అగార్కర్​ సమర్థించాడు.

rohit sharma
రోహిత్ శర్మ
author img

By

Published : Feb 4, 2022, 3:25 PM IST

Rohit Sharma Captaincy: భారత్​-విండీస్​ మధ్య ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్​ ప్రారంభం కానుంది. ఈ సిరీస్​కు టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​శర్మ సారథ్యం వహించనున్నాడు. విరాట్​ కోహ్లీ నుంచి పగ్గాలు అందుకున్న తర్వాత పూర్తిస్థాయి కెప్టెన్​గా జట్టుకు సారథ్యం వహించనుండటం రోహిత్​కు ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రోహిత్​ శర్మ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ బౌలర్​ అజిత్​ అగార్కర్​. ఫిట్​గా ఉండటమే రోహిత్​కు ఉన్న అతిపెద్ద సవాల్​ అని అభిప్రాయపడ్డాడు.

"పరిమిత ఓవర్ల క్రికెట్​కు ఒక్కరే కెప్టెన్​ ఉండాలనే నిర్ణయం సరైనదే. రోహిత్​ కెప్టెన్​గా రాణిస్తాడు. కానీ అతని ముందున్న అతిపెద్ద సవాల్​ ఫిట్​నెస్​. నా దృష్టిలో ఇప్పటినుంచి ప్రపంచకప్​ వరకు ఫిట్​గా ఉంటూ మెరుగైన ప్రదర్శన చేయాలి. మాజీ కెప్టెన్లు విరాట్​ కోహ్లీ, ఎంఎస్​ ధోనీలకు ఫిట్​నెసే బలం. మ్యాచ్​లకు వాళ్ల గైర్హాజరు కావడం చాలా అరుదు"

-అజిత్​ అగార్కర్​, మాజీ బౌలర్

గతేడాది.. వన్డే, టీ20ల కెప్టెన్​గా కోహ్లీ స్థానంలో రోహిత్​ శర్మను బీసీసీఐ నియమించింది. దక్షిణాఫ్రికా పర్యటనలో రోహితే జట్టుకు సారథ్యం వహించాల్సింది. కానీ తొడకండరాల సమస్యల కారణంగా సిరీస్​కు దూరమయ్యాడు.

ఇదీ చూడండి : పుజారాలా డిఫెన్స్‌.. సెహ్వాగ్‌లా ఎదురు దాడి చేయగలడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.