టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) తర్వాత టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా తప్పుకోనున్న రవిశాస్త్రి (Ravi Shastri News).. ఐపీఎల్ కొత్త జట్టు అహ్మదాబాద్‌కు కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జట్టు యాజమాన్యం సీవీసీ క్యాపిటల్ ఇదివరకే శాస్త్రిని సంప్రదించిందట. అయితే మెగా ఈవెంట్‌పై ప్రస్తుతం పూర్తిగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో దీనిపై శాస్త్రి తుది నిర్ణయం తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్ జట్టుకు టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సహా ఇతర సహాయక సిబ్బందిని శాస్త్రి వెంటబెట్టుకెళ్తాడని తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే స్పష్టత రానుంది. ఎందుకంటే డిసెంబర్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో (IPL 2022 Mega Auction) క్రికెటర్ల ఎంపికలో కోచ్ కీలక పాత్ర పోషిస్తాడు.
వచ్చే ఏడాది ఐపీఎల్లో (IPL 2022) మొత్తంగా 10 జట్లు పాల్గొననున్నాయి. అక్టోబర్‌లో జరిగిన బిడ్డింగ్ ప్రక్రియ అనంతరం అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు కొత్తగా చేరాయి. లఖ్‌నవూ కోసం ఆర్పీఎస్జీ గ్రూప్ రూ.7090 కోట్లు, అహ్మదాబాద్‌కు సీవీసీ క్యాపిటల్ రూ.5625 కోట్లు వెచ్చించాయి.
ఇదీ చూడండి: కివీస్‌తో సిరీస్.. టీమ్ఇండియాలోకి ఈ ఐపీఎల్ స్టార్లు!