ETV Bharat / sports

Rashid Khan Ratan Tata : 'రషీద్ ఖాన్​కు రూ.10 కోట్లు రివార్డు'.. ఆ వార్తలతో తనకేం సంబంధం లేదన్న రతన్ టాటా - క్రికెటర్లకు 10 కోట్ల రివార్డు రతన్ టాటా

Rashid Khan Ratan Tata 10 Crore Reward : అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్​కు రూ.10 కోట్లు రివార్డు ప్రకటించినట్లు వచ్చిన వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్​టాటా కొట్టిపారేశారు. వాటిని నమ్మొద్దని కోరారు. అసలేమైందంటే?

RATAN TATA RASHID KHAN
RATAN TATA RASHID KHAN
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 3:14 PM IST

Rashid Khan Ratan Tata 10 Crore Reward : అఫ్గానిస్థాన్‌ అగ్రశ్రేణి క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌కు తాను రూ.10 కోట్లు రివార్డు ప్రకటించినట్లు ఇటీవల సోషల్ మీడియాలో జరుతున్న ప్రచారాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. ఆ వార్తలను కొట్టిపారేస్తూ సోమవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అలాంటి వాట్సాప్ ఫార్వర్డ్ సందేశాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తాను ఏ క్రికెటర్ తరఫునా మాట్లాడలేదని అన్నారు.

వివరాల్లోకి వెళ్తే...
Rashid Khan Indian Flag : 2023 ప్రపంచకప్ టోర్నమెంట్​లో భాగంగా ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో అఫ్గానిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. అయితే, ఈ మ్యాచ్ తర్వాత రషీద్ ఖాన్.. భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని సంబరాలు చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో అతడికి ఐసీసీ రూ.55 లక్షలు జరిమానా విధించిందని ప్రచారమైంది. ఈ విషయాన్ని కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. దీనికి రతన్ టాటా స్పందించి రషీద్ ఖాన్​కు రూ.10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించారని ఆ పోస్టుల్లో పేర్కొన్నారు.

  • Pakistan Complain to ICC aganist Rasid Khan during his victory celebration with indian flag ICC fine 55 lakh aganist Rasid Khan but Ratan Tata declare 10 crore to Rasid Khan

    — Guruprasad Mohanty (@Gurupra62640661) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నా నుంచి వస్తే తప్ప నమ్మొద్దు'
ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన నేపథ్యంలో రతన్ టాటా దీనిపై స్పందిస్తూ ఎక్స్​లో పోస్ట్ చేశారు. తనకు క్రికెట్​తో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఏ ఆటగాడి జరిమానా గురించి.. తాను ఐసీసీకి గానీ, ఇతర క్రికెట్ సంస్థలకు గానీ ఎలాంటి సూచనలు చేయలేదని స్పష్టం చేశారు. ఏ ఆటగాడికీ రివార్డు ప్రకటించలేదని చెప్పారు. 'నా నుంచి అధికారికంగా సమాచారం వస్తే కానీ ఇలాంటి వాట్సప్ ఫార్వర్డ్ సందేశాలు, తప్పుడు వీడియోలు నమ్మొద్దు' అని రతన్ టాటా తన పోస్ట్​లో పేర్కొన్నారు.

  • I have made no suggestions to the ICC or any cricket faculty about any cricket member regarding a fine or reward to any players.

    I have no connection to cricket whatsoever

    Please do not believe WhatsApp forwards and videos of such nature unless they come from my official…

    — Ratan N. Tata (@RNTata2000) October 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI World Cup 2023 PAK VS AFG : అఫ్గాన్​ సంచలన విజయం వెనక టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్!

పాక్​తో అక్టోబర్ 23న చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​లో అఫ్గాన్ అనూహ్య విజయం సాధించింది. తొలుత బౌలింగ్​లో పాక్​ను 282 పరుగులకు కట్టడి చేసిన అఫ్గాన్ జట్టు.. అనంతరం 49 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. అఫ్గాన్ టాపార్డర్ సత్తా చాటడం వల్ల.. సునాయాసంగా పాక్​పై విజయం సాధించింది. ఈ విజయం అనంతరం అఫ్గాన్ ప్లేయర్లు స్టేడియంలో ఉత్సాహంగా స్టెప్పులేశారు. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. రషీద్​తో కలిసి డ్యాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ODI World Cup 2023 IND VS ENG : ఈ సారి 'బెస్ట్‌ ఫీల్డర్‌'లో బిగ్​ ట్విస్ట్‌.. ఇంతకీ ఎవరు అందుకున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.