ETV Bharat / sports

తెలుగు కుర్రాళ్లకు గోల్డెన్ ఛాన్స్- చరణ్ క్రికెట్​ టీమ్​లోకి ఆహ్వానం- రిజిస్టర్ చేసుకోండిలా! - టీమ్ హైదరాబాద్ ఐఎస్​పీఎల్

Ram Charam Team Hyderabad ISPL : గ్లోబల్​ స్టార్ రామ్​చరణ్ క్రీడా రంగంలో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల యువతను క్రీడల్లో ప్రోత్సహించే విధంగా ఆయన ఐఎస్​పీఎల్​లో 'టీమ్ హైదరాబాద్​' జట్టును కొనుగోలు చేశారు.

Ram Charam Team Hyderabad ISPL
Ram Charam Team Hyderabad ISPL
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 1:28 PM IST

Updated : Dec 24, 2023, 2:21 PM IST

Ram Charam Team Hyderabad ISPL : టాలీవుడ్ స్టార్ హీరో రామ్​చరణ్ ఇండియన్ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL- T10 ) లీగ్​లో 'టీమ్ హైదరాబాద్‌' జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్​ ద్వారా తెలియజేశారు. 'ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్‌లో టీమ్ హైదరాబాద్ జట్టుకు జట్టుకు యజమానిగా వ్యవహరించడం హ్యాపీగా ఉంది. టాలెంట్, సమాజంలో స్ఫూర్తిని పెంపొందించడం, గల్లీ క్రికెట్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఇది ఓ ప్లాట్​ఫామ్' అని ట్విట్టర్​లో తెలిపారు. ఆసక్తి ఉన్న ఆటగాళ్లు జట్టులో జాయిన్ అవ్వడానికి ఓ లింక్​ను ఆయన షేర్ చేశారు. ఈ లింక్​ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. కాగా, ఈ ఐఎల్​పీఎల్ తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి 9 వరకు జరగనుంది.

రామ్​చరణ్ సినిమాతో పాటు వ్యాపార రంగంలోనూ యాక్టీవ్​గా ఉంటారు. ఇక తాజాగా ఐఎస్​పీఎల్​లో భాగస్వామ్యం కావడంపై ఆయన మాట్లాడారు.' క్రికెట్​లో కొత్తరకమైన ఎంటర్​టైన్​మెంట్​ను ఈ టోర్నీ అందించనుంది. లోకల్ ప్లేయర్లు తమ టాలెంట్​ను నేషనల్​వైడ్​గా​చూపేందుకు ఈ టోర్నీ ప్లాట్​ఫామ్​లా ఉపయోగడుతుంది. నేను హైదరాబాద్​ జట్టును సొంతం చేసుకోవడం హ్యాపీగా ఉంది' అని అన్నారు. అయితే ఈ టోర్నీతో తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్​పై ఇంట్రెస్ట్​ ఉన్నవారికి రామ్​చరణ్ మంచి అవకాశం కల్పించినట్లైంది. ఇక ఈ లీగ్​లో రామ్​చరణ్​తోపాటు బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్ (శ్రీ నగర్), అమితాబ్ బచ్చన్ (ముంబయి), హృతిక్ రోషన్ (బెంగళూరు) జట్లకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు.

ఈ టోర్నమెంట్​ గురించి మరిన్ని విషయాలు

  • ఈ టోర్నీ టీ10 ఫార్మాట్​లో టెన్నిస్ బాల్​తో నిర్వహిస్తారు.
  • జట్టులో ఉండే 11 మందిలో ఒక్కరైనా అండర్-19 ఏజ్​ గ్రూప్​ ప్లేయర్ ఉండాలి. ఇక ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు.
  • టోర్నీలో ఆడాలనుకునే ప్లేయర్లు ISPL వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్టర్ అయ్యాక ట్రయల్స్​లో పాల్గొనేందుకు గోల్డెన్ టికెట్ (ఎంట్రీ పాస్) పొందాల్సి ఉంటుంది.
  • ట్రయల్స్ జరిగే గ్రౌండ్, దానికి సంబంధించిన పలు వివరాలు త్వరలోనే వెబ్​సైట్​లో అప్​లోడ్ చేస్తారు.
  • ట్రయల్స్​లో ప్రదర్శన ఆధారంగా టోర్నీకి ప్లెయర్లను ఎంపిక చేస్తారు.
    • Excited to announce my ownership of Team Hyderabad in the Indian Street Premier League!

      Beyond cricket, this venture is about nurturing talent, fostering community spirit, and celebrating street cricket's essence.

      Join me as we elevate Hyderabad's presence in the ISPL,… pic.twitter.com/DQA29n18qp

      — Ram Charan (@AlwaysRamCharan) December 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఫోర్బ్స్' మ్యాగజైన్​పై స్టైలిష్​గా చెర్రీ, ఉప్సీ- టాలీవుడ్​ ఫస్ట్ కపుల్​గా ఘనత!

రామ్​చరణ్​కు అరుదైన గౌరవం- పాప్ గోల్డెన్ అవార్డ్స్​లో విజేతగా స్టార్ హీరో

Last Updated : Dec 24, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.