ETV Bharat / sports

అండర్​-19 ప్రపంచకప్​ హీరోపై ఆ ఆరోపణలు! - అండర్-​19 ప్రపంచకప్​ వార్తలు

Rajvardhan Hangargekar News: ఇటీవల జరిగిన అండర్​-19 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసి, ఐపీఎల్​ మెగావేలంలో చెన్నై జట్టులో ఛాన్స్​ కొట్టేసిన రాజవర్ధన్​​​ చిక్కుల్లో పడ్డాడు. ఇంతకీ ఏమైంది?

Rajvardhan Hangargekar News
అండర్​-19 ప్రపంచకప్​
author img

By

Published : Feb 18, 2022, 5:20 PM IST

Rajvardhan Hangargekar News: ఈ ఏడాది జరిగిన పురుషుల అండర్​-19 ప్రపంచకప్​లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత బౌలర్​ రాజవర్ధన్​ హంగర్గేకర్​. ఇటీవల ఐపీఎల్​ వేలంలోనూ బంపర్​ఆఫర్​ కొట్టేశాడు. చెన్నై జట్టు రూ. కోటిన్నర వెచ్చించి ఇతడిని జట్టులోకి తీసుకుంది. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు చిక్కుల్లో పడ్డాడు.

అండర్​-19 వరల్డ్​కప్​లో టీమ్​ఇండియాకు ఆడిన హంగర్గేకర్​​.. వయసు తగ్గించి చూపాడనే​ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అండర్​-19లో ఆడేందుకు బీసీసీఐకి తన వయసును తక్కువగా చూపించుకున్నట్లు స్పోర్ట్స్​ అండ్​ యూత్​ డిపార్ట్​మెంట్​ కమిషనర్​ ఓం ప్రకాశ్​ బకోరియా ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ఓంప్రకాశ్​ బీసీసీఐకి లేఖ కూడా రాసినట్లు పేర్కొంది.

అతని వయసు 21 ఏళ్లు..

హంగర్గేకర్​ ప్రస్తుత వయసు 21 ఏళ్లు అని.. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నట్లు ఓంప్రకాశ్​ తన లేఖలో పేర్కొన్నారు. హంగర్గేకర్​.. ధారాశివ్​లోని తెర్నా పబ్లిక్​ స్లూల్​లో విద్యాభ్యాసం పూర్తి చేశాడని ఓం ప్రకాశ్​ తెలిపారు. ఆ పాఠశాల రికార్డుల ప్రకారం హంగర్గేకర్​​ పుట్టినతేదీ 2001 జనవరి 10గా ఉందని.. అయితే ఎనిమిదో తరగతికి వచ్చాక హంగర్గేకర్​​ తన పుట్టినతేదీ వివరాలను మార్చుకున్నాడని ఆరోపించారు. ఆ తేదీని 2002 నవంబరు 10గా మార్పించుకున్నాడని లేఖలో పేర్కొన్నారు.

ఒకవేళ ఈ ఆరోపణలే నిజమైతే హంగర్గేకర్​కు ఇబ్బందులు తప్పవు. దర్యాప్తులో దోషిగా తేలితే బీసీసీఐ హంగర్గేకర్​పై రెండేళ్ల పాటు నిషేధం విధిస్తుంది. అలా కాకుండా తన తప్పును దర్యాప్తునకు ముందే ఒప్పుకొంటే ఈ శిక్ష నుంచి హంగర్గేకర్​కు మినహాయింపు ఉంటుంది.

ఇదివరకు కూడా..

ఈ తరహా ఘటనలు ఇదివరకు కూడా జరిగాయి. 2018 అండర్​-19 ప్రపంచకప్​ ఆటగాడు మన్జోత్​​ కల్రా కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మాజీ ఆటగాడు కీర్తి ఆజాద్​ వ్యాఖ్యల ప్రకారం.. కల్రా అండర్​-16 స్థాయి నుంచే ఏజ్​ ఫ్రాడ్​కు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ మన్జోత్​పై రెండేళ్ల పాటు నిషేధం విధించింది.

ఇదీ చూడండి : 'క్రికెట్‌ గురించి మాట్లాడితే ఆమె ముఖం వెలిగిపోతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.