ETV Bharat / sports

కోహ్లీపై ద్రవిడ్ ప్రశంసల వర్షం.. అతడో అద్భుతమంటూ! - కోహ్లీపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు

Dravid about Kohli: తన పదేళ్ల టెస్టు కెరీర్​లో విరాట్ కోహ్లీ ఒక ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని ప్రశంసించాడు టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతమని పేర్కొన్నాడు.

Rahul Dravid praises kohli, dravid about kohli, కోహ్లీపై ద్రవిడ్ ప్రశంసలు, కోహ్లీ ద్రవిడ్ న్యూస్
Rahul Dravid
author img

By

Published : Dec 25, 2021, 4:04 PM IST

Dravid about Kohli: పదేళ్ల టెస్టు కెరీర్లో విరాట్‌ కోహ్లీ ఆటగాడిగా ఎంతో పరిణతి సాధించాడని టీమ్ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్‌ స్థాయికి ఎదగడం అద్భుతమని పేర్కొన్నాడు. ద్రవిడ్ ఇటీవల బీసీసీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి పలు విషయాలు వెల్లడించాడు.

"2011లో విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసే నాటికి.. నేను ఇంకా క్రికెట్లో కొనసాగుతూనే ఉన్నాను. అతడితో కలిసి కొన్ని మ్యాచులు కూడా ఆడాను. ఈ పదేళ్ల కాలంలో కోహ్లీ ఒక ఆటగాడిగా, పరిపూర్ణమైన వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కెప్టెన్ స్థాయికి ఎదగడం అద్భుతంగా అనిపిస్తోంది. ఆటలో పర్‌ఫెక్షన్‌ కోసం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాడు. ఓ నాయకుడిగా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ విషయంలో చాలా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాడు."

-ద్రవిడ్, టీమ్ఇండియా కోచ్

ఇప్పటి వరకు 97 టెస్టులు ఆడిన కోహ్లీ 50.65 సగటుతో 7,801 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు, 27 అర్ధ శతకాలు ఉన్నాయి. 2011లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు. ద్రవిడ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే, రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా ద్రవిడ్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 40, రెండో ఇన్నింగ్స్‌లో 112 పరుగులు చేసిన ద్రవిడ్ ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇవీ చూడండి: షరపోవా.. అభిమానుల గుండెను మీటిన పాలకోవా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.