ETV Bharat / sports

Ashwin to Manjrekar: 'అలా అనకురా చారీ.. బాధేస్తుంది!' - మంజ్రేకర్​పై అశ్విన్​ అపరిచితుడు మీమ్​

భారత మాజీ క్రికెటర్​ సంజయ్​ మంజ్రేకర్(Sanjay Manjrekar)​ వ్యాఖ్యలపై టీమ్​ఇండియా స్పిన్నర్​ అశ్విన్​(Ravichandran Ashwin) ట్విట్టర్​లో సరదాగా స్పందించాడు. అశ్విన్.. 'ఆల్​టైమ్​ గ్రేట్​' క్రికెటర్​ కాదన్న వ్యాఖ్యలపై 'అపరిచితుడు' సినిమాలోని ఓ డైలాగ్​ మీమ్​ రీట్వీట్​ చేశాడు. ఈ పోస్ట్​ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

R Ashwin uses hilarious meme in response to Sanjay Manjrekar's criticism
Ashwin to Manjrekar: 'అలా అనకురా చారీ.. బాధేస్తుంది!'
author img

By

Published : Jun 9, 2021, 10:18 AM IST

టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లౌక్యం ప్రదర్శించాడు! మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌(Sanjay Manjrekar)కు పరోక్షంగా తిరుగులేని పంచ్‌ ఇచ్చాడు. తన ప్రకారం అశ్విన్​ ఇంకా 'ఆల్‌టైం గ్రేట్‌' జాబితాలో చేరలేదని చెప్పినందుకు ఇలా స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మంజ్రేకర్‌ ఈ విధంగా మాట్లాడాడు.

"ఆల్‌టైం గ్రేట్‌ అన్నది క్రికెటర్లకు ఇచ్చే అత్యున్నత ప్రశంస, గుర్తింపు. డాన్‌ బ్రాడ్‌మన్‌, సోబర్స్‌, గావస్కర్‌, తెందూల్కర్‌, విరాట్‌ తదితర క్రికెటర్లు నా పుస్తకంలో ఆల్‌టైం గ్రేట్‌. అశ్విన్‌ ఇంకా అక్కడికి చేరుకోలేదని గౌరవంగా చెబుతున్నా."

- సంజయ్‌ మంజ్రేకర్‌, క్రికెట్​ కామెంటేటర్​

అతడి వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. అశ్విన్‌ గొప్పవాడే అంటూ అనేకమంది మద్దతుగా నిలిచారు. నేథన్‌ లైయన్‌ కంటే అశ్విన్‌ మెరుగని ఆసీస్‌ మాజీ సారథి ఇయాన్‌ ఛాపెల్‌ అన్నాడు. పాక్‌ మాజీ క్రికెటర్‌ సల్మాన్ భట్‌ కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించాడు. మరోవైపు అశ్విన్​ అభిమానులు మాత్రం మంజ్రేకర్‌ను ట్రోల్‌ చేశారు. గతంలో రవీంద్ర జడేజాను 'బిట్స్‌ అండ్‌ పీసెస్‌' క్రికెటర్‌గా వర్ణించిన విధానాన్ని గుర్తు చేశారు.

సంజయ్‌ మంజ్రేకర్‌ 'ఆల్‌టైం గ్రేట్‌' వ్యాఖ్యలకు అశ్విన్​ కూడా సున్నితంగా హాస్యస్ఫూర్తి(Ashwin to Manjrekar)తో స్పందించాడు. 'అపరిచితుడు' చిత్రంలో విక్రమ్‌ మీమ్‌ను రీట్వీట్‌ చేశాడు. అందులో రామం తన మిత్రుడు చారీతో.. 'అలా అనకురా చారీ, మనసంతా బాధగా ఉంటుంది'(Ashwin Aparichitudu meme) అన్న మాటలు ఉన్నాయి. అయితే ఆ మాటలు తమిళంలో ఉండటం వల్ల 'తమిళం అర్థంకాని వాళ్ల కోసం, ఈ మాటలు అపరిచితుడు చిత్రంలోనివి' అని మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చాడు.

ఇదీ చూడండి.. IPL 2021: టోర్నీ అప్పటి వరకు అంటే కష్టమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.