Punam Raut World Cup squad: న్యూజిలాండ్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగబోయే మహిళల వన్డే ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టును గురువారం ప్రకటించారు. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఖరారు చేశారు. అయితే ఈ జట్టులో శిఖాపాండే, జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు స్టార్ బ్యాటర్ పూనమ్ రౌత్‌కు చోటు దక్కలేదు. దీంతో అసహనానికి గురైన పూనమ్.. సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
- — Punam Raut (@raut_punam) January 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Punam Raut (@raut_punam) January 6, 2022
">— Punam Raut (@raut_punam) January 6, 2022
"ఒక అనుభవం ఉన్న బ్యాటర్‌గా, భారత్ తరఫున స్థిరంగా రాణిస్తున్న నన్ను ప్రపంచకప్ కోసం ఎంపికచేయకపోవడం చాలా బాధ కలిగించింది. 2021లో ఆడిన ఆరు వన్డేల్లో 73.75 సగటుతో 295 పరుగులు చేశాను. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. మంచి ప్రదర్శన చేస్తున్నా జట్టులో చోటు దక్కకపోవడం వల్ల దిగ్భ్రాంతికి గురయ్యా. ఏదేమైనప్పటికీ జట్టులో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు."
-పూనమ్ రౌత్, టీమ్ఇండియా మహిళా క్రికెటర్
ప్రపంచకప్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగే ఈ టోర్నీలో భారత జట్టుకు మిథాలీ రాజ్ సారథ్యం వహిస్తుంది. ఆంధ్ర క్రీడాకారిణి సబ్బినేని మేఘన స్టాండ్‌బైగా ఎంపికైంది. న్యూజిలాండ్‌తో జరిగే ఏకైక టీ20కి కూడా భారత జట్టును ఎంపిక చేశారు. ఈ జట్టులో మేఘన సభ్యురాలు.
భారత ప్రపంచకప్ జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీవర్మ, యాస్తిక భాటియా, దీప్తిశర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, ఝులన్ గోస్వామి, పూజ వస్త్రకార్, మేఘన సింగ్, రేణుక సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ దిల్ బహదూర్