ETV Bharat / sports

విండీస్​తో వన్డే పోరుకు టీమ్​ఇండియా రెడీ.. ధావన్‌ కెప్టెన్సీలో అమీతుమీ

ఇంగ్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్​ల విజయం తర్వాత అదే ఉత్సాహంతో.. వెస్టిండీస్‌తో పోరుకు రెడీ అయ్యింది టీమ్​ఇండియా. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్​లో విండీస్​తో అమీతుమీ తేల్చుకోనుంది.

Slug PREVIEW: With bilateral ODIs fighting for context, India's fringe players to battle against West Indies
విండీస్​తో వన్డే పోరుకు టీమ్​ఇండియా రెడీ.. ధావన్‌ కెప్టెన్సీలో అమీతుమీ
author img

By

Published : Jul 21, 2022, 10:38 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన.. టీ20, వన్డే సిరీస్‌లలో జయభేరి మోగించిన భారత క్రికెట్‌ జట్టు శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరిగే తొలి వన్డేలో.. శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌పై పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడిన ధావన్‌ వెస్టిండీస్‌పై రాణించి ఫామ్‌ అందుకోవాలని భావిస్తున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ గైర్హాజరీలో ధావన్‌తో కలిసి శుభమన్‌ గిల్‌.. భారత ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశముంది. వన్‌డౌన్‌లో దీపక్‌ హూడా రానుండగా.. నాలుగోస్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడనున్నాడు.

ఐదోస్థానం కోసం శ్రేయస్‌ అయ్యర్‌, సంజు శాంసన్‌ మధ్య పోటీనెలకొంది. హార్డిక్‌ పాండ్యా స్థానంలో శార్దుల్‌ ఠాకూర్‌ ఆల్‌రౌండర్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటేల్‌లతో స్పిన్‌ విభాగం బలంగా ఉంది. మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ధ కృష్ణలకు తుదిజట్టులో చోటు ఖాయం కాగా ఆర్షదీప్‌సింగ్‌ వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు.. గత ఫిబ్రవరిలో భారత్‌లో 0-3తో సిరీస్‌ ఓడిన వెస్టిండీస్‌.. ఆ పరాజయానికి సొంతగడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. ఈ మ్యాచ్‌.. శుక్రవారం సాయంత్రం ఏడింటికి ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: బీసీసీఐ పిటిషన్‌పై కొత్త అమికస్‌ క్యూరీని నియమించిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.