ETV Bharat / sports

పాక్​ కెప్టెన్​కు చేదు అనుభవం.. గంటపాటు మ్యాచ్​ ఆడకుండా నిరసన!

పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఇంగ్లాండ్​తో జరుగుతున్నటెస్టు మ్యాచ్​​ రెండో రోజున గంటపాటు మైదానంలోకి రాకుండా నిరసన తెలిపాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

pakistan vs england test series 2022 Babar Azam

author img

By

Published : Dec 19, 2022, 5:53 PM IST

ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​కు చేదు అనుభవం ఎదురైంది. తన కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్​ కోసం హోటల్​ బయటకు వెళ్లడానికి సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. దీంతో అసహనానికి గురైన బాబర్​.. ఇంగ్లాండ్​తో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు మొదటి గంట పాటు మైదానంలోకి రాకుండా డ్రెస్సింగ్​ రూమ్​లోనే ఉన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరుకు నిరసనగా బాబర్​ ఇలా చేశాడని సమాచారం.

బాబర్​తో పాటు జట్టులోని కొంత మంది సభ్యులు.. వారి కుటుంబాలతో సహా శనివారం డిన్నర్ కోసం హోటల్​ బయట​కు బయలుదేరారు. వారు హోటల్​ నుంచి బయటకు వస్తుండగా వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి సెక్యూరిటీ క్లియరన్స్​ తీసుకోవాలని కోరారు. దీంతో కోపానికి గురైన బాబర్​.. కొంతసేపు సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం అసహనంతో తన గదిలోకి వెళ్లాడు. అయితే, ఈ రెండు జట్లకు అధ్యక్షుడి తరహా భద్రత ఏర్పాటు చేశారు.

మ్యాచ్​ ప్రారంభమయ్యే సమయానికి బాబర్​ మైదానంలోకి రాలేదు. గంటపాటు రాకుండా నిరసన తెలిపినట్టు సమాచారం. కాగా, ఈ విషయంపై పాకిస్థాన్​​ క్రికెట్​ బోర్టు స్పందించలేదు. అయితే, తలనొప్పి కారణంగా బాబర్​ గ్రౌండ్​లోకి రాలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్లేయర్లు కట్టుదిట్టమైన సెక్యూరిటీతో విసుగు చెందుతున్నామని వాపోతున్నట్టు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.