Pakistan Vs Afghanistan World Cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది అఫ్గానిస్థాన్ టీమ్. పసికూన జట్టు అని తక్కువ అంచనా వేసిన వారందరికీ కంగు తినిపించేలా ఆడి.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఇటీవలే ఇంగ్లాండ్‌తోనూ ఇదే తీరులో ఆడి విజయకేతనం ఎగురవేసిన అఫ్గాన్ జట్టు.. ఈ మ్యాచ్‌తో సెమీస్‌కు చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. అయితే వారి చేతిలో మరో నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున.. సెమీస్‌కు చేరుకోవడం అంత సులభం కాదని విశ్లేషకుల అంచనా.
ప్రస్తుతం ఈ గెలుపును ఆస్వాదిస్తున్న అఫ్గాన్ జట్టు.. అక్టోబర్ 30న పుణెలో శ్రీలంకతో, నవంబర్ 3న లఖ్‌నవూలో నెదర్లాండ్స్‌తో తలపడనుంది. అక్కడ కూడా అఫ్గాన్‌దే పై చేయిలా కనిపిస్తోంది. ఇక నవంబర్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో అలాగే నవంబర్ 10న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో అఫ్గానిస్థాన్ జట్టు.. చివరి రెండు లీగ్ గేమ్‌లు ఆడనుంది.
-
Look, what this win means for us! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Incredible scenes in Chennai! 👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/G17vJ9gl5q
">Look, what this win means for us! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023
Incredible scenes in Chennai! 👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/G17vJ9gl5qLook, what this win means for us! 🤩
— Afghanistan Cricket Board (@ACBofficials) October 23, 2023
Incredible scenes in Chennai! 👏#AfghanAtalan | #CWC23 | #AFGvPAK | #WarzaMaidanGata pic.twitter.com/G17vJ9gl5q
కానీ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లును చిత్తు చేయడం అఫ్గాన్‌కు కాస్త కష్టంగా మారచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేం. ఏదేమైనప్పటికీ అఫ్గాన్ మాత్రం ఇప్పుడున్న దూకుడును ప్రదర్శిస్తే తప్పకుండా సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
World Cup 2023 Pakistan Team : అఫ్గానిస్థాన్ చేతిలో ఓటమి వల్ల పాకిస్థాన్ ఇప్పుడు తేలుకోని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఇప్పటి వరకు అఫ్గన్ చేతిలో వన్డే మ్యాచ్ ఓడని పాక్ సేన .. ఏకంగా వరల్డ్ కప్‌లో ఓటమిని ముూటగట్టుకుంది. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ జట్టు సెమీస్‌కు చేరుకునే అవకాశాలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం ఉన్న టీమ్స్‌లో భారత్, న్యూజిల్యాండ్, దక్షిణాఫ్రికా.. ఈ మూడు టీమ్స్ అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఇక సెమీస్ రేసులో కూడా ఈ మూడు జట్లే ముందంజలో ఉన్నాయి. దీంతో సెమీస్‌లో పాల్గొననున్న నాలుగు జట్లలో మూడు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. అయితే కచ్చితంగా ఈ జట్లే సెమీస్ చేరతాయని చెప్పలేకపోయినప్పటికీ.. ప్రస్తుతం వాటికున్న ఫామ్ చూస్తే ఇక మిగతా జట్లకు అవకాశం దొరకడం కష్టంగానే అనిపిస్తోంది.
ఈ క్రమంలో మిగిలిన జట్లు చివరి స్థానంలో కోసం పోటీ పడాల్సి ఉంది. అందులో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్, ఉండగా.. ఇప్పుడు పాక్ కూడా ఆ స్థానం కోసం పోటీ పడనుంది. వీటిలో ఇంగ్లాండ్ ఇప్పటికే పేలవ ప్రదర్శన కనబరిచించి సెమీస్ ఆశలపై నీళ్లు జల్లింది. ఇక ఆస్ట్రేలియా కూడా అంతంతమాత్రంగానే ఆడినప్పటికీ.. వేగం పుంజుకుంటే ఈ జట్టు కూడా సెమీస్‌కు చేరుకునే అవకాశాలున్నాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు అఫ్గాన్ చేతిలో ఓటమి వల్ల పాకిస్థాన్ జట్టు ఐదవ స్థానంలో ఉంది. అయితే పాక్ నెట్ రన్ రేట్ -0.400గా ఉండటం వల్ల ఇప్పటికైతే కొంచం కుదురుగానే ఉంది. ఇక పాక్.. తర్వాతి మ్యాచుల్లో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. వీటిలో బంగ్లా మినహా మిగతా మూడు జట్లపై విజయం సాధించడం పాక్‌కు అంత ఈజీ కాదు. దీంతో ఇక నుంచి పాక్ చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుందని విశ్లేషకుల మాట.
-
#PAKvAFG | #DattKePakistani | #CWC23 pic.twitter.com/HGgqorO0iM
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#PAKvAFG | #DattKePakistani | #CWC23 pic.twitter.com/HGgqorO0iM
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2023#PAKvAFG | #DattKePakistani | #CWC23 pic.twitter.com/HGgqorO0iM
— Pakistan Cricket (@TheRealPCB) October 23, 2023