Asif Ali fight with Fareed Malik : ఆసియా కప్‌లో భాగంగా బుధవారం పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీల్డ్‌లో ప్లేయర్స్ అదుపు తప్పగా స్టాండ్స్‌లోని అభిమానులు రెచ్చిపోయారు. ఈ లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో చివరికి పాకిస్థాన్ ఒక్క వికెట్‌తో గెలిచి ఫైనల్‌కు చేరింది.
-
The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate
— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7
">The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate
— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022
#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7The fight between Asif Ali and the Afghan bowler💥 Very unfortunate
— Nadir Baloch (@BalochNadir5) September 7, 2022
#PAKvAFG pic.twitter.com/AQzxurWNB7
అయితే అంతకుముందు పాక్ బ్యాటర్ ఆసిఫ్ అలీని ఔట్ చేసిన ఆనందంలో అఫ్గాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ కాస్త ఎక్కువగానే సంబరాలు చేసుకున్నాడు. ఆసిఫ్ అలీ ముందుకు వెళ్లి విజయనాదం చేశాడు. ఆగ్రహించిన ఆసిఫ్ అదుపు తప్పాడు. ఒక్కసారిగా ఫరీద్‌ను వెనక్కి నెట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడం వల్ల ఆసిఫ్ ఈ సారి ఫరీద్‌ను ఏకంగా బ్యాట్‌తోనే కొట్టబోయాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా మిగతా అఫ్గాన్ ప్లేయర్లు,అంపైర్లు వచ్చి వారిద్దరిని సముదాయించారు. ఆ తర్వాత ఆసిఫ్ అలీ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా మ్యాచ్ తర్వాత ఫీల్డ్ బయట స్టాండ్స్‌లోని అఫ్గానిస్థాన్ అభిమానులు వీరంగం సృష్టించారు. స్టేడియాన్ని ధ్వంసం చేశారు. కుర్చీలను పాకిస్థాన్ అభిమానులపైకి విసిరారు. విజయం అఫ్గాన్‌దే అన్న తరుణంలో పాక్ ప్లేయర్లు కొట్టిన చివరి రెండు సిక్స్‌లు అఫ్గాన్ అభిమానులను షాకుకి గురయ్యేలా చేశాయి. నిరాశతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న అఫ్గాన్ ఫ్యాన్స్ పాక్ ఫ్యాన్స్ పైకి కుర్చీలు విసిరారు.
-
Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa
— Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa
— Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022Afghanistan fans once again showing that they cannot take defeat gracefully #AFGvPAK #AsiaCup #Cricket pic.twitter.com/0u5yrMx9Xa
— Saj Sadiq (@SajSadiqCricket) September 7, 2022
ఇదీ చదవండి: టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ గుడ్‌న్యూస్!
ఆఖర్లో 2 బంతులకు 2 సిక్సర్లు.. అఫ్గాన్‌పై పాక్ గెలుపు.. టీమ్ ఇండియా ఇంటికి..