ODI World Cup 2023 Marco Jansen : ప్రస్తుతం జరుగుతోన్న ప్రపంచకప్ - 2023లో నామమాత్రపు అంచనాలతో బరిలోకి దిగిన జట్టు దక్షిణాఫ్రికా. అంచనాలకు మించి రాణిస్తూ భారీ విజయాలతో ముందుకు దూసుకుపోతోంది. ఒక్క నెదర్లాండ్స్ చేతిలో మాత్రమే పరాజయం పొందింది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది.
పాయింట్ల పట్టిక ప్రకారం.. దక్షిణాఫ్రికా కన్నా టీమ్ ఇండియా ముందున్నప్పటికీ.. రన్‌రేట్ విషయంలో మాత్రం ఏ జట్టుకు అందనంత ఎత్తులో కొనసాగుతోంది. 2.370 రన్‌రేట్‌తో ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టుకు ఈ స్థాయి రన్‌రేట్ లేదు. అయితే దక్షిణాఫ్రికా ఇంతటి భారీ విజయాలు సాధించడంలో డికాక్, క్లాసెన్, మార్క్రమ్, డస్సెన్ శతకాలు బాది కీలక పాత్ర పోషించారు. అయితే ఈ జట్టులో కనిపించని హీరో మరొకడు ఉన్నాడు. అతడే మార్కో జన్సెన్. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి ఆడుతున్న అతడు.. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు.. ప్రస్తుతం జరుగుతున్న పాక్ మ్యాచ్‌ను కూడా కలుపుకుని ఆడిన జన్సెన్ 61.50 యూవరేజ్తో 123 పరుగులు చేశాడు. అలాగే 12 వికెట్లు తీశాడు.
ఫలితంగా ఈ విజయాలతో ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా హాట్ ఫేవరెట్ టీమ్‌గా మారిపోయింది. ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి అగ్రశ్రేణి జట్లు పసికూన జట్ల చేతుల్లో ఓటమి ఎదుర్కొంటున్న నేపథ్యంలో సఫారీలపై ఒక్కసారి అంచనాలు పెరిగిపోయాయి. టీమ్ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు ఈ టీమ్ కూడా వరల్డ్‌కప్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. పైగా ఈ జట్టుకు జన్సెన్ లాంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అదనపు బలంలా మారడం, ప్రతి మ్యాచ్‌లో అతడు బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్‌లా తయారవ్వడం కూడా జట్టుపై మరింత అంచనాలను పెంచుతోంది. చూడాలి మరి ఈ ప్రపంచకప్‌ను సౌతాఫ్రికా ముద్దాడుతుందో లేదో..
ODI World Cup 2023 : వరల్డ్ రికార్డ్ బ్రేక్.. ఒకే మ్యాచ్‌లో 3 సెంచరీలు.. లంకపై సౌతాఫ్రికా ఘన విజయం