ODI World Cup 2023 IND VS AUS : 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు వరుసగా బిగ్ షాక్ ఇచ్చారు ఆస్ట్రేలియా బౌలర్లు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ ముగ్గురు ఖాతా తెరవకుండానే 0 పరుగులకు ఔట్ అయ్యారు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి 2 పరుగులు మాత్రమే చేసి 3 టాప్ ఆర్డర్ కీలక వికెట్లను కోల్పోయింది. ఆ రెండు పరుగులు కూడా ఎక్స్ట్రా రూపంలో వచ్చినవే. ఫలితంగా ప్రత్యర్థి జట్టును 199 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం కాసేపు కూడా లేకుండా పోయింది.
మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్, స్లిప్‌లో కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక 6 బంతులు ఆడిన రోహిత్ శర్మ, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. రోహిత్ రివ్యూ తీసుకున్నా, టీవీ రిప్లేలో ఫలితం అంపైర్ కాల్స్‌గా రావడం వల్ల టీమ్ ఇండియాకు ఫలితం దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి హెజిల్ వుడ్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ప్లేయర్లపై, టీమ్ఇండియాపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి.
ఆపిన చోటే మళ్లీ మొదలు.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమ్ఇండియా. కే ఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగు చేసి అప్పుడు ఔట్ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రపంచకప్‌ను అలానే మొదలుపెట్టింది. ఈ సారి ఏకంగా 2 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది. 40 ఏళ్ల తర్వాత తొలిసారిలా.. ఇకపోతే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం 40 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతకుముందు 1983లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ డకౌట్ అయ్యారు.
-
The situation of Indian fans right now.#INDvsAUS pic.twitter.com/i8qGZSP5Vs
— Krishna (@Atheist_Krishna) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The situation of Indian fans right now.#INDvsAUS pic.twitter.com/i8qGZSP5Vs
— Krishna (@Atheist_Krishna) October 8, 2023The situation of Indian fans right now.#INDvsAUS pic.twitter.com/i8qGZSP5Vs
— Krishna (@Atheist_Krishna) October 8, 2023
Ind vs Aus World Cup 2023 : స్పిన్ మ్యాజిక్.. ఆస్ట్రేలియా ఆలౌట్.. టీమ్ ఇండియా లక్ష్యం ఎంతంటే?