టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అఫ్గానిస్థాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్(Rashid Khan News) పెళ్లి అంశంపై రూమర్లు వచ్చాయి. తమ జట్టు ప్రపంచకప్ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని రషీద్(Rashid Khan Marriage) చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి. దీనిపై స్పందించిన రషీద్.. ఇవన్నీ తప్పుడు మాటలని అన్నాడు. మెగా టోర్నీలో తమ జట్టు కోసం గొప్పగా బౌలింగ్ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు.
"మొదట ఈ రూమర్లు వినగానే నేను షాక్‌కు గురయ్యా. నిజానికి, ప్రపంచకప్ గెలిస్తే పెళ్లి చేసుకుంటానని నేనెప్పుడూ అనలేదు. 2021, 2022.. టీ20 ప్రపంచకప్, 2023 వరల్డ్ కప్(50 ఓవర్లు) దృష్ట్యా.. రానున్న రోజుల్లో నేను మరిన్ని కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని మాత్రమే చెప్పా. నా ఫోకస్ ఇప్పుడు క్రికెట్‌పైనే ఉంది పెళ్లిపై కాదు."
-రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ స్పిన్నర్.
టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) గ్రూప్ 2లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు అక్టోబర్ 25న షార్జా వేదికగా ఓ మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో రషీద్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలోనూ ప్రపంచకప్‌లో స్పిన్నర్లదే హవా ఉంటుందని రషీద్ అభిప్రాయపడ్డాడు.
టాప్ 5 ఆటగాళ్లు వీరే..
టీ20లో టాప్-5 ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేశాడు రషీద్. విరాట్ కోహ్లీ, కీరన్ పొలార్డ్, కేన్ విలియమ్సన్, ఏబీ డివిలియర్స్, హార్దిక్ పాండ్యా టీ20ల్లో గొప్ప ఆటగాళ్లని అన్నాడు. కాగా, ఇందులో అతడి పేరు చెప్పుకోకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: