ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీది ప్రత్యేక జర్నీ. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, గత సీజన్‌లో మాత్రం పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. అయితే ఈ మెగాటోర్నీ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టైన ముంబయి ఇండియన్స్.. టోర్నీ ప్రారంభించిన ఐదేళ్ల వరకు తొలి ట్రోఫీని ముద్దాడని ఆ టీమ్ ఆ తర్వాత ఏకంగా ఐదుసార్లు గెలుపొంది.. నంబర్‌వన్ టీమ్‌గా ఎదిగింది. ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర కీలకమైతే.. ఆటగాళ్లపై ఆ జట్టుకుండే నమ్మకం ఇంకొకటి అని చెప్పవచ్చు. తన సక్సెస్‌తో విన్నింగ్ మెషీన్ అని అభిమానుల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ ప్రిమియర్ లీగ్‌లో ఆ టీమ్ సక్సెస్, ప్రదర్శన ఆ రేంజ్లో ఉంటుంది మరి. అయితే గత సీజన్‌లో కాస్త నెమ్మదించింది. అయితే ఆ జట్టు తగ్గేదేలే. ఒకసారి కుదరుకుంటే ఈ టీమ్ కప్ కొట్టకుండా ఎవరూ ఆపలేరు. అంత పటిష్టంగా ఉంది. ఇప్పటికే ఆ జట్టులోని ఆటగాళ్ల ఎన్నో రికార్డులను తమ పేరిట రాసుకున్నారు. ఆ జట్టు కూడా పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ముంబయికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు ఏంటో తెలుసుకుందాం..
- ముంబయి ఇప్పటివరకు ఐదు ట్రోఫీలను ముద్దాడింది. 2013, 2015, 2017, 2019, 2020ల్లో టైటిల్‌ను నెగ్గి.. ఈ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలను అందుకున్న జట్టుగా నిలిచింది. టోర్నీ విన్నర్‌గా నిలిచింది.
- ఈ ఐపీఎల్ చరిత్రలో ముంబయి ఇప్పటివరకు 186 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏకంగా 108 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
- ఐపీఎల్ చరిత్రలో 100 లీగ్ మ్యాచ్‌లు విజయం సాధించిన ఏకైక జట్టుగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఆ జట్టుకు ఇది ఎంతో ప్రత్యేక విషయమనే చెప్పాలి.
- గత పదేళ్లుగా చెన్నై చెపాక్ మైదానంలో ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన జట్టే లేదు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో ముంబయిదే విజయం.
- ఈ టీమ్‌లోని బ్యాటర్లు కూడా ఎంతో బలంగా ఆడుతుంటారు. కొడితే ఫోర్, లేదంటే సిక్స్ అంటూ మైదానంలో చెలరేగిపోతుంటారు. ఇదీ ముంబయి బ్యాటింగ్ టీమ్‌కు నిదర్శనం. ఇప్పటివరకు టోర్నీలో 1308 సిక్స్‌లు బాదారు. అలాగే 2980 ఫోర్లు బాదారు. ఇదే ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.
- ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఛేజింగ్ కూడా ముంబయిదే అని చెప్పాలి. 2008లో 87 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది.
- ప్రత్యర్థి జట్టును ఏకంగా 146 పరుగుల తేడాతో ఓటమిని అందించిన ఘనత ముంబయిదే. 2017లో దిల్లీ క్యాపిటల్స్‌పై ఈ మార్క్‌ను అందుకుంది.
- ఈ మెగాటోర్నీలో ముంబయి బౌలర్ల దూకుడు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. అన్ని టీమ్‌ల కన్నా మేటిగా 40 మెయిడిన్ ఓవర్లు వేసింది. ఇది ఆ జట్టు బౌలర్ల ఆధిపత్యానికి నిదర్శనం.
- ఒక ఇన్నింగ్స్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా ముంబయి ఇండియన్స్ బౌలర్‌దే అని చెప్పాలి. 2019లో 0అల్జారీ జోసెఫ్ హైదరాబాద్‌పై 6/12తో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
- వందకు పైగా వికెట్లు తీసిన ముగ్గురు బౌలర్లు ముంబయి జట్టులోనే ఉన్నారు. లసిత్ మలింగ (122 వికెట్లు), హర్భజన్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా (120) ఆ మార్క్‌ను అందుకున్నారు.
ఇదీ చూడండి: KKR కొత్త కెప్టెన్ నితీశ్ రానా భార్యను చూశారా.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే!