ETV Bharat / sports

'అదే జరిగితే శార్దూల్​కు జట్టులో చోటివ్వాలి'

MSK Prasad about Shardul Thakur: దక్షిణాఫ్రికా పర్యటనలో పేస్ ఆల్​రౌండర్​గా సేవలందిస్తున్న శార్దూల్ ఠాకూర్​కు తుదిజట్టులో చోటు కల్పించాలని సూచించాడు టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్. దీంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలంగా తయారవుతుందని తెలిపాడు.

shardul thakur SA series, MSK Prasad about Shardul Thakur, శార్దూల్ ఠాకూర్ లేటెస్ట్ న్యూస్, శార్దూల్ ఠాకూర్ గురించి ఎమ్మెస్కే ప్రసాద్
shardul thakur
author img

By

Published : Dec 24, 2021, 11:12 AM IST

Updated : Dec 24, 2021, 11:48 AM IST

MSK Prasad about Shardul Thakur: త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్‌ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భావిస్తే ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని టీమ్‌ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల టీమ్‌ఇండియా విదేశీ పర్యటనల్లో శార్దూల్‌ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలో శార్దూల్‌ గురించి ఎమ్మెస్కే ప్రసాద్‌ మాట్లాడాడు. శార్దూల్‌ చేరిక వల్ల బ్యాటింగ్ లైనప్‌ మరింత బలోపేతం అవుతుందన్నారు.

"టీమ్ఇండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే శార్దూల్ ఠాకూర్ అత్యుత్తమ ఎంపిక అవుతాడని నేను భావిస్తున్నా. ఏడో స్థానంలో బ్యాటర్‌గా కూడా ఉపయోగపడతాడు. అతనికి తోడుగా మరో ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. అతడు తుది జట్టులో ఉంటే బ్యాటింగ్ లైనప్‌ కూడా మరింత బలంగా తయారవుతుంది. ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా ఇషాంత్ శర్మ స్థానంలో ప్రతిభావంతుడైన మహ్మద్ సిరాజ్ ఆడతాడని అనుకుంటున్నా. బుమ్రా, అశ్విన్‌, మహ్మద్‌ షమీ, సిరాజ్‌లు ఫిట్‌గా ఉంటే జట్టులో కచ్చితంగా ఉంటారు."

-ఎమ్మెస్కే ప్రసాద్, టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్

దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులు, 3 వన్డేలు ఆడనుంది టీమ్‌ఇండియా. సెంచూరియన్‌ వేదికగా తొలి రెండు టెస్టులు జరగనున్నాయి. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు కేప్‌ టౌన్‌లో నిర్వహించనున్నారు. డిసెంబరు 26న తొలి టెస్టు(బాక్సింగ్‌ డే టెస్టు) ప్రారంభంకానుంది. ఇదిలా ఉండగా, దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టీమ్‌ఇండియా ఒక్క టెస్టు సిరీస్‌ని కూడా గెల్చుకోలేకపోయింది. ఈ సారైనా ఆ కల నెరవేరుతుందో లేదో చూడాలి.

ఇవీ చూడండి: Neeraj Chopra Birthday: ఊబకాయాన్ని జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచి!

Last Updated : Dec 24, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.