ఐపీఎల్ వాయిదాతో ఇంటి వద్ద సరదాగా గడుపుతున్నాడు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. అటు కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపడమే కాకుండా తన ఫామ్‌హౌజ్‌లోని పెంపుడు జంతువులతో కాలక్షేపం చేస్తున్నాడు.
ఇటీవల కొత్తగా తెచ్చిన 'చేతక్' అనే గుర్రానికి ధోనీ మసాజ్ చేస్తుండగా.. అతడి భార్య సాక్షి ఆ సన్నివేశాన్ని కెమెరాలో బంధించింది. దీనిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది సాక్షి. ప్రస్తుతం ఈ వీడియో మహి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: 'టీమ్‌పై కోహ్లీ కంటే అతడి ప్రభావమే ఎక్కువ'