టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ప్రశంసలు కురిపించాడు ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీ 'మహారాజు' లాంటివాడని అన్నాడు. అతడిని సీఎస్కే ఫ్రాంఛైజీ ఎప్పటికీ వదులుకోదని తెలిపాడు.
"ధోనీని చెన్నై జట్టు ఎప్పటికీ వదులుకోదు. సీఎస్కే ఫ్రాంఛైజీకి అతడు 'మహారాజు' లాంటివాడు. మహి ఆ జట్టుకు ఆటగాడి నుంచి కోచ్‌గానూ మరే అవకాశం ఉంది."
- బ్రాడ్ హాగ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.
ఈ డిసెంబర్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ప్రతి ఫ్రాంఛైజీ నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చని బీసీసీఐ సూచించింది. ధోనీని.. సీఎస్కే వదిలేస్తే ఏ ఫ్రాంఛైజీ అయినా అతన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పాడు బ్రాడ్‌హాగ్.
-
MS Dhoni is not leaving @ChennaiIPL He is the Maharaja of the franchise. He will transition into a coaching role. #IPL https://t.co/DtCmjtEk6c
— Brad Hogg (@Brad_Hogg) July 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">MS Dhoni is not leaving @ChennaiIPL He is the Maharaja of the franchise. He will transition into a coaching role. #IPL https://t.co/DtCmjtEk6c
— Brad Hogg (@Brad_Hogg) July 5, 2021MS Dhoni is not leaving @ChennaiIPL He is the Maharaja of the franchise. He will transition into a coaching role. #IPL https://t.co/DtCmjtEk6c
— Brad Hogg (@Brad_Hogg) July 5, 2021
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టుకు ధోనీ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఆ టీమ్‌కు మూడు సార్లు టైటిల్ అందించగా.. అతని నాయకత్వంలో ఐదు సార్లు రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుత సీజన్లోనూ ఏడు మ్యాచ్‌లు ఆడిన ధోనీసేన.. 5 మ్యాచ్‌లు గెలిచి కప్ ఫెవరేట్లలో ఒకటిగా ఉంది. కొవిడ్ కారణంగా వాయిదా పడిన ఈ టోర్నీని యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: టీ20ల్లో రికార్డు.. 'డబుల్'తో మెరిసిన యువ క్రికెటర్