ETV Bharat / sports

MS Dhoni: కొత్త లుక్​లో ధోనీ.. మురిసిపోతున్న ఫ్యాన్స్​

విభిన్న హేర్​స్టైల్స్​తో అభిమానులను అలరించడం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్​ ధోనీకి (MS Dhoni) అలవాటే. ఐపీఎల్​ 14వ సీజన్​ రెండో దశలో భాగంగా ఇప్పటికే దుబాయ్​ చేరుకున్న మహి.. మరో కొత్త లుక్​తో దర్శనమిచ్చాడు. ధోనీ నయా స్టైల్​ను చూసి ఫ్యాన్స్​ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

MS Dhoni
ఎంఎస్ ధోనీ
author img

By

Published : Aug 20, 2021, 3:21 PM IST

కెప్టెన్​, కీపర్​, బ్యాట్స్​మన్​.. ఇలా ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేసిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni). ఆటతోనే కాదు ఆహార్యంలోనూ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్​ 14వ సీజన్​ రెండో దశలో భాగంగా ప్రస్తుతం యూఏఈలో ఉన్న ఈ సీఎస్కే సారథి.. తాజాగా సరికొత్త లుక్​తో దర్శనమిచ్చాడు. ఈ ఫొటోను స్టార్​ స్పోర్ట్స్​ తన అధికారిక ట్విట్టర్​లో షేర్ చేసింది.

కెరీర్ ఆరంభంలో జులపాల జుట్టుతో కనిపించిన ధోనీ.. టీ20 ప్రపంచకప్​ గెలిచిన తర్వాత తన వేషధారణ పూర్తిగా మార్చేశాడు. కొంతకాలం చిన్న హేర్​తో కొత్తగా కనిపించాడు. గతంలో సన్యాసి వేషధారణలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు మహి. గుండు కొట్టించుకుని బౌద్ద సన్యాసి లాగా మారాడు. ఇదే కాకుండా ఇటీవల కాలంలో కుర్రాళ్లకు బాగా ఇష్టమైన హేర్​స్టైల్​లో దర్శనమిచ్చాడు.

కరోనా వల్ల ఆగిపోయిన ఐపీఎల్​ సెప్టెంబర్​ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా యూఏఈకి చేరుకుంది సీఎస్కే జట్టు. ఇప్పటికే 7 మ్యాచ్​లాడిన చెన్నై టీమ్​.. 5 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: ఓ ఇంటివాడైన టీమ్ఇండియా పేసర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.