Mohd Siraj Gifts : జులై 12 నుంచి వెస్టిండీస్‌తో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అందులో భాగంగా ఇప్పటికే విండీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు జరగబోయే టోర్నీల్లో పాల్గొనేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్ మ్యాచులను కూడా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే బార్బడోస్ మైదానంలో ఉన్న కొందరు వెస్టిండీస్ యువ ఆటగాళ్లు భారత క్రికెటర్లతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా హైదరాబాదీ యువ ఆటగాడు మహ్మద్ సిరాజ్ వారికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్‌గా బ్యాట్, షూస్ ఇచ్చి ఖుషీ చేశాడు. అంతేగాక ఆటకు సంబంధించి తన విలువైన సలహాలు, సూచనలను కూడా వారితో పంచుకున్నాడు ఈ హైదరాబాదీ కుర్రాడు.
సెల్ఫీలు.. ఆపై సూచనలు..
West Indies Tour : మరోవైపు మైదానంలో ఉన్న సిరాజ్, ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, అజింక్యా రహానేతో పాటు మరికొంత మంది భారత ఆటగాళ్లతో సెల్ఫీలు దిగి సంబరపడ్డారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌లో, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అప్‌కమింగ్ కరీబియన్ ప్లేయర్స్‌కు సలహాలు సూచనలు ఇచ్చారు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్‌లతో మాత్రం కొందరు క్రికెట్ లవర్స్ టీ-షర్ట్‌లపై ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో సిరాజ్ చేసిన పనిని చూసిన కొందరు నెటిజన్స్ అతడిని మెచ్చుకుంటున్నారు. హైదరాబాదీ కుర్రాడు మంచి మనసు చాటుకున్నాడంటు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
-
Kind gestures 👌
— BCCI (@BCCI) July 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Autographs ✍️
Selfies 🤳
Dressing room meets 🤝#TeamIndia make it special for the local players and fans in Barbados 🤗 #WIvIND pic.twitter.com/TaWmeqrNS6
">Kind gestures 👌
— BCCI (@BCCI) July 7, 2023
Autographs ✍️
Selfies 🤳
Dressing room meets 🤝#TeamIndia make it special for the local players and fans in Barbados 🤗 #WIvIND pic.twitter.com/TaWmeqrNS6Kind gestures 👌
— BCCI (@BCCI) July 7, 2023
Autographs ✍️
Selfies 🤳
Dressing room meets 🤝#TeamIndia make it special for the local players and fans in Barbados 🤗 #WIvIND pic.twitter.com/TaWmeqrNS6
ఈసారి యంగ్ ప్లేయర్లకు..
West Indies Tour India Squad : వరల్డ్ కప్ ముగింట సిరీస్ కావడంతో.. టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ మూడు సిరీస్‌లను ఎలాగైనా గెలవాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ మూడు సిరీస్‌లలో టెస్ట్ సిరీస్, వన్డేకు మాత్రం రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలక్టర్లు.. టీ20 సీరీస్‌కు మాత్రం సీనియర్ క్రికెటర్లకు బ్రేక్ ఇచ్చింది. ఈ టోర్నీలో యంగ్ ప్లేయర్స్‌కు అవాకాశాన్ని కల్పించింది.
వన్డే, టెస్టు జట్టు..
West Indies ODI Test Team India Squad :రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు మరికొంతమంది సీనియర్ ఆటగాళ్లు టెస్టు, వన్డే జట్టులో ఉన్నారు.
టీ20 స్క్వాడ్..
West Indies T20 Team India Squad : హార్దిక్ పాండ్యా(కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ ఖాన్, ముఖేశ్ కుమార్.