ప్రపంచ టైటిల్ నెగ్గడంలో న్యూజిలాండ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురవుతుందోమోనని భయపడినట్లు ఆ దేశ మాజీ సారథి బ్రెండన్ మెక్‌కలమ్ తెలిపాడు. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని జట్టు మొట్టమొదటి టెస్టు ఛాంపియన్‌షిప్‌లో గెలిచి జగజ్జేతగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.
"కొన్నేళ్లుగా న్యూజిలాండ్ ప్రదర్శన గొప్పగా సాగుతోంది. కానీ, అసలైన విజయానికి చేరువలో వచ్చి నిలిచిపోతున్నారు. అయితే, సంప్రదాయ క్రికెట్ ఫార్మాట్(టెస్టు)లో ఇలాంటి ఘనత సాధించడం అద్భుతం. మంగళవారం రాత్రికి మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠలో ఉన్నా. గత రెండు వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేదు అనుభవాలు మరోసారి ఎదురవుతాయా అనిపించింది. ప్రతికూల వాతావరణంలో అసామాన్య టీమ్ఇండియాపై గెలుపొందడం అద్వితీయం."
-బ్రెండన్ మెక్‌కలమ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్
టీమ్ఇండియాతో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో డబ్ల్యూటీసీ టైటిల్ కైవసం చేసుకుంది కివీస్. 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ మినహా ఏ ఇతర ఐసీసీ టైటిల్ నెగ్గని ఆ జట్టు.. సుదీర్ఘ పోరాటం అనంతరం టెస్టుల్లో ఆ ఘనత సాధించింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఫైనల్ చేరిన న్యూజిలాండ్ రన్నరప్‌గానే మిగిలింది.
ఇదీ చూడండి: Cricket: ఏడు ఐసీసీ టోర్నీలు.. ప్రతిసారి కొత్త విజేతనే