శ్రీలంక వెటరన్ క్రికెటర్ లసిత్ మలింగ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. యార్కర్లతో ప్రపంచ ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన ఈ పేసర్.. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు మంగళవారం ప్రకటించాడు. ఇదివరకే టెస్టులు, వన్డేలకు గుడ్‌బై చెప్పేసిన మలింగ.. టీ20ల నుంచి కూడా రిటైర్ అవుతున్నట్లు స్పష్టం చేశాడు.
2014 టీ20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టుకు మలింగానే కెప్టెన్. వైట్‌బాల్ క్రికెట్ లెజెండ్‌గా పేరుగాంచిన మలింగ తన రిటైర్మెంట్ గురించి సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు.
"నా టీ20 బూట్లకు శాశ్వత విశ్రాంతినిస్తున్నా. ఈ రోజు నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నా. నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. రాబోయే కాలంలో యువ క్రికెటర్లతో నా అనుభవాన్ని పంచుకుంటా."
- లసిత్ మలింగ, శ్రీలంక మాజీ క్రికెటర్
శ్రీలంక జాతీయ జట్టు, ముంబయి ఇండియన్స్ సహా తాను ఆడిన అన్ని ఫ్రాంఛైజీలు, సహచరులకు మలింగ కృతజ్ఞతలు తెలిపాడు. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. టీ20లో 107, వన్డేల్లో 338, టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో మలింగ పడగొట్టిన 170 వికెట్లు ఇప్పటికీ రికార్డే!
టీ20ల్లో అత్యధిక వికెట్లు, రెండు హ్యాట్రిక్‌ల ఘనత అతడి సొంతం. వన్డేల్లో మూడు హ్యాట్రిక్‌లు సాధించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: