ETV Bharat / sports

lanka premier league 2023 : మ్యాచ్​ మధ్యలో పాము ఎంట్రీ.. క్రికెటర్లు హడల్​.. వీడియో చూశారా? - లంక ప్రీమియర్ లీగ్​లో అనుకునో అతిథి

lanka premier league 2023 : లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్​లో ఊహించని సంఘటన జరిగింది. మ్యాచ్​ను వీక్షించేందుకు ఓ పాము వచ్చింది. స్టేడియంలోకి సడెన్​ ఎంట్రీ ఇచ్చింది. దీంతో క్రికెటర్లు, వీక్షకులు ఉలిక్కిపడ్డారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 1, 2023, 9:14 AM IST

lanka premier league 2023 : లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్​లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. కొలంబో వేదికగా గాలె టైటాన్స్ - దంబుల్లా ఆరా మధ్య జరిగిన మ్యాచ్​ను.. వీక్షించడానికి ఓ అనుకోని అతిథి వచ్చి హడల్​ పుట్టించింది.

ఇంతకీ అదెవరంటే.. దంబుల్లా జట్టు బ్యాటింగ్​కు దిగిన సమయంలో ఓ పాము స్టేడియంలోకి సడెన్ ఎంట్రీ ఇచ్చింది. క్రీజులో ధనంజయ్ డిసిల్వా, కుశాల్ పెరీరా ఆడుతుండగా.. మైదానంలోకి వచ్చింది. కాసేపు అక్కడక్కడే తిరిగింది. దాన్ని స్టేడియంలోని స్క్రీన్‌పై కూడా చూపించారు. ఆ సమయంలో ఒక్క సారిగా అక్కడి ప్లేయర్లు.. పామును చూసి ఉలిక్కిపడ్డారు. దీంతో కాసేపు ఓ పది నిమిషాల పాటు మ్యాచ్​ను ఆపేశారు నిర్వాహకులు.

ఇక ఆ పామును చూసిన అంపైర్​లు.. వెంటనే మైదానంలోని భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్‌ ఓవర్‌ జరిగింది. ఇందులో దంబుల్లా జట్టుపై గాలే టైటాన్స్ విజయాన్ని సాధించింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన గాలె టైటాన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. భానుక రాజపక్స(48), కెప్టెన్ దాసున్ షనక(42 నాటౌట్) మంచిగా ఆడారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన దంబుల్లా తన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 180 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్‌ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక ఈ సూపర్‌ ఓవర్‌లో మొదట బ్యాటింగ్​కు దిగిన దంబుల్లా వికెట్‌ కోల్పోయి 9 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన గాలె టైటాన్స్.. రెండు బంతుల్లోనే 11 పరుగులు చేసింది. ఫలితంగా విజయాన్ని అందుకుంది. గాలె టైటాన్స్​ ఓపెనర్‌ రాజపాక్స వరుసగా ఓ సిక్స్‌, ఓ ఫోర్‌ కొట్టేసి తమ టీమ్​కు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు.

ఇదీ చూడండి :

Ashes series eng vs aus fifth test 2023 : బ్రాడ్‌ అదరహో.. రసవత్తరంగా సిరీస్​​ ఆఖరి రోజు.. ఇంగ్లాండ్​దే విజయం

Stuart Broad On Yuvraj Singh : యువరాజ్​ వల్లే సక్సెస్​ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.