ETV Bharat / sports

WTC Final: 'అలా అయితే కోహ్లీ, రోహిత్​లకు ఇబ్బందే' - డబ్ల్యూటీసీ ఫైనల్​ దిలీప్​ వెంగ్​సర్కార్​

మ్యాచ్​ ప్రాక్టీస్​ లేకపోతే టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC Final) కోహ్లీ,​ రోహిత్​ శర్మ ఇబ్బంది పడతారని అన్నాడు వెంగ్​సర్కార్. ఈ పోరుకు​ ముందు ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడటం న్యూజిలాండ్​కు కలిసొస్తుందని చెప్పాడు.

kohli
కోహ్లీ,రోహిత్
author img

By

Published : Jun 6, 2021, 4:21 PM IST

ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు(WTC Final) ముందు సరైన మ్యాచ్​ ప్రాక్టీస్​ లేకుండా బరిలోకి దిగితే సారథి కోహ్లీ, రోహిత్​ శర్మ ఇబ్బందిపడొచ్చని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్​ వెంగ్​సర్కార్ అభిప్రాయపడ్డాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్​.. ఈ ఫైనల్​కు ముందు ఇంగ్లాండ్​తో రెండు టెస్టులు ఆడటం వారికి కలిసొచ్చే అంశమని అన్నాడు.

"కోహ్లీ చాలా కాలంగా ఆడుతున్నాడు. ప్రపంచ క్రికెట్​లో ఉత్తమ బ్యాట్స్​మెన్​లో ఒకడు. విరాట్​(Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma)​ వరల్డ్​ క్లాస్​ ప్లేయర్స్​. వారిద్దరూ మంచి ఫామ్​లో ఉన్నారు. కానీ మ్యాచ్​ మ్యాచ్​ ప్రాక్టీస్​ లేకపోవడం.. ఫైనల్​లో వారిని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నాను. టీమ్​ఇండియా మంచి ఫామ్​లో ఉన్నప్పటికీ.. న్యూజిలాండ్​కు ఈ ఛాంపియన్​షిప్​ ముందు ఇంగ్లాం​డ్​తో ఆడటం కలిసొచ్చే అంశం. వారు అక్కడి పరిస్థితులకు అలవాటు పడతారు. కాబట్టి భారత జట్టు కూడా కనీసం రెండు, మూడు మ్యాచ్​లు ఆడితే బాగుండేది"

-దిలీప్​ వెంగ్​సర్కార్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్.

భారత జట్టు.. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో సాధన చేస్తోంది. జూన్‌ 18-22వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) తలపడుతుంది. ఆ తర్వాత అక్కడే ఆగస్టు 4- సెప్టెంబర్​ 14 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది.

ఇదీ చూడండి Kohli x Williamson: 'పోటీ కాదు.. ముందుకు నడిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.