స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లికి సర్వం సిద్ధమైంది. మరి కొన్ని గంటల్లో తన ప్రియురాలు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్‌శెట్టి కుమార్తె, నటి అతియాశెట్టిని వివాహం చేసుకోనున్నాడు. మహారాష్ట్ర, ఖండాలలోని సునీల్‌శెట్టి ఫామ్‌హౌస్‌లో సాయంత్రం నాలుగు గంటలకు వీరి వివాహం జరగనుంది. కుటుంబసభ్యుల సమక్షంలో జరగనున్న ఈ పెళ్లి వేడుకకు కేవలం వంద మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
భారీగా ఏర్పాట్లు.. రెండు రోజుల నుంచి ఖండాలలోని ఫామ్ హౌస్ వెలుగులతో జిగేల్ మంటోంది. అతిథులు అక్కడ సందడి చేయడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఇప్పటికే కాబోయే వధూవరులకు అక్కడే మెహందీ కార్యక్రమం కూడా నిర్వహించారు. సంగీత్‌ను కూడా నిర్వహించారు. ఈ వేడుకలో నూతన వధూవరులు కేఎల్‌రాహుల్ అతియాతో పాటు ఇరు కుటుంబసభ్యులు.. డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేశారు. అలానే హల్దీ తంతు కూడా జరిగింది. ఇకపోతే సాయంత్రం హిందూ సంప్రాదాయ పద్ధతిలో పెళ్లి జరగనుంది.
నో ఎంట్రీ.. కేవలం ఆహ్వానం ఉన్నవారిని మాత్రమే వేడుకకు అనుమతించేలా చర్యలు తీసుకున్నారు. ఫోన్లను సైతం అనుమతించడం లేదని తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు వెళ్లకుండా సునీల్ శెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
స్పెషల్ గెస్ట్‌గా కోహ్లీ, సల్మాన్.. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వివాహమైన తర్వాత సాయంత్రం ఆరు గంటల సమయంలో కొత్త జంట మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
3 వేల మందితో రిసెప్షన్.. ఇక పెళ్లి అనంతరం కేఎల్ రాహుల్, అతియా శెట్టి.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ కానున్నారని తెలిసింది. అందుకే రిసెప్షన్‌ను కాస్త ఆలస్యంగా ఐపీఎల్ తర్వాత నిర్వహించనున్నట్లు తెలిసింది. ముంబయి వేదికగా గ్రాండ్‌గా నిర్వహించనున్నారట. దాదాపు 3 వేల మంది అతిథులతో ఈ రిసెప్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో సినీ తారలు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా బెంగళూరులో మరో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి:
రాహుల్ అతియా పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు.. ముస్తాబైన వివాహ వేదిక.. ముహూర్తం ఎప్పుడంటే?
హీరోయిన్లను పెళ్లి చేసుకున్న క్రికెటర్లు బాలీవుడ్‌తో ఫెవికాల్ బంధం