KL Rahul-Mayank Agarwal Record: దక్షిణాఫ్రికా గడ్డపై టీమ్ఇండియా ఓపెనర్లు కొత్త చరిత్ర సృష్టించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డుకెక్కారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటివరకు(ప్రస్తుత పర్యటనకు ముందు) టీమ్ఇండియా 21 టెస్టులు ఆడగా.. రెండుసార్లు మాత్రమే ఓపెనర్లు వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.
ఇప్పుడు కేఎల్ రాహుల్-మయాంక్ జోడీ ముచ్చటగా మూడోసారి సెంచరీ భాగస్వామ్య ఫీట్‌ను అందుకున్నారు. 2006-07లో వసీమ్-జాఫర్-దినేశ్‌కార్తీక్ జోడీ(153 పరుగులు), 2010-11లో సెహ్వాగ్-గంభీర్ ద్వయం(137 రన్స్) చేశారు. దీంతో 11ఏళ్ల తర్వాత టీమ్ఇండియా ఓపెనర్లు మళ్లీ ఈ రికార్డు నెలకొల్పినట్టైంది.
2021లో టెస్టుల్లో భారత ఓపెనర్లు వికెట్ పడకుండా 20కు పైగా ఓవర్లుగా ఆడటం ఇది ఏడోసారి. గత పదేళ్లలో(2011-20) చూసుకుంటే ఒక్కసారి కూడా మన ఓపెనర్లు ఇన్ని ఓవర్లు ఆడలేదు.
ఇదీ చూడండి: IND VS SA: కేఎల్ అర్ధశతకం.. పుజారా 'గోల్డెన్' డక్‌పై ట్రోలింగ్