Kapil Dev Ind vs Pak match: ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం తలపడనున్నవేళ.. భారత మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ 1986 మ్యాచ్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క వికెట్ తేడాతో 1986 ఆస్ట్రాల్-ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ ఓడిపోవడం గుర్తుకొస్తే ఇప్పటికీ నిద్ర పట్టదని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
"270 పరుగులు చేయవలసిన ఆ మ్యాచ్‌లో వసీం అక్రమ్‌కు మూడు వికెట్లు తీసినందున టీమిండియా 245 పరుగుల వద్ద ఆగిపోవాల్సివచ్చింది. చివరి ఓవర్లో పాక్ టార్గెట్ 13 పరుగులు ఉంది. ఆ సమయంలో అది దాదాపు అసాధ్యం అనుకున్నాము. కానీ అనూహ్యంగా పాక్ విజయం సాధించింది" అని కపిల్ దేవ్ తెలిపారు.
"చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చేతన్ వద్దకు వెళ్లి లోయార్కర్ వేయమని చెప్పగా అది ఫుల్‌టాస్‌గా మారింది. దాన్ని మియాందాద్ సిక్సర్‌గా మలిచాడు. మేము ఇప్పటికీ ఆ క్షణంలో చేతన్‌ది తప్పుకాదని భావిస్తున్నాము. ఆరోజు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ నాకు నిద్రపట్టదు. ఆ ఓటమి మొత్తం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి నాలుగేళ్ల సమయం పట్టింది."
- కపిల్ దేవ్, టీమిండియా మాజీ కెప్టెన్
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రెండు దేశాల మధ్య కొన్ని సిరీస్‌లు ఆగినప్పటికీ.. అభిమానులు మాత్రం భారత్ -పాక్ మ్యాచ్ అంటే ముందుంటారు. భారత్-పాక్‌ల మధ్య గతంలో ఎన్నో చిరస్మరణీయమైన మ్యాచ్‌లు జరిగాయి. అయినప్పటికీ 1986 ఆస్ట్రేలియన్-ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మాత్రం పాకిస్థాన్ సాధించిన గొప్ప విజయాలలో ఒకటిగా నిలిపోయింది.
ఇవీ చదవండి