ఆ అవుట్‌తో ధోనీ కన్నీళ్లు పెట్టుకుంది ఇదే రోజు. మహీ రనౌట్‌తో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలు ముక్కలైంది ఈరోజే. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ నుంచి కోహ్లీ సేన వెనుదిరిగి నేటికి రెండేళ్లు. ప్రపంచకప్‌లో అప్పటివరకు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన టీమ్ఇండియా.. అనూహ్యంగా నిష్క్రమించింది. ఎన్నేళ్లు గడిచినా ఆ దృశ్యాలు భారత క్రికెట్ ప్రేమికుల్లో.. ఓ గుర్తుచేసుకోకూడని జ్ఞాపకంగా మిగిలిపోతుంది!
మాంచెస్టర్ వేదికగా జులై 9న ప్రారంభమైన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డే(జులై 10)కి వెళ్లింది. న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది. ఆ తర్వాత మైదానంలో దిగిన కోహ్లీ సేన మొదట్లోనే తప్పటడుగులు వేసింది. 24 రన్స్‌కే నాలుగు వికెట్లను కోల్పోయింది. ఇండియన్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కుప్పకూలగా.. మైదానంలోని ప్రేక్షకుల ముఖాల్లో నిరాశ నెలకొంది.
ధోని రనౌట్..
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ, జడేజాలు విజయంపై ఆశలు రేకెత్తించారు. జడేజా భారీ షాట్లతో అర్థ సెంచరీ పూర్తిచేసుకోగా.. ధోనీ అండతో అతడు విజయతీరాలకు చేరుస్తాడని అనుకున్నారు అందరూ. కానీ అంతలోనే విలియమ్స్‌న్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా వెనుదిరిగాడు. అప్పటికీ ఏదో ఆశ. ధోనీ క్రీజులో ఉన్నంత సేపు విజయంపై ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ మార్టిన్ గుప్టిల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. గుప్టిల్ విసిరిన బంతితో మహీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ అవుట్‌తో ప్రేక్షకుల గుండెలు బద్దలయ్యాయి. ధోనీ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు, డ్రెస్సింగ్ రూంలో రోహిత్ శర్మ భావోద్వేగం.. ప్రతి ఒక్కరినీ కదిలించింది. 2019 వన్డే వరల్డ్ కప్ నుంచి భారత్ నిష్క్రించింది. ధోనీకి అదే చివరి మ్యాచ్ అని అప్పుడు ఎవరూ ఊహించలేదు. ఆ మ్యాచ్ జరిగిన ఏడాదికి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవీ చదవండి:MS Dhoni: 'కూల్'గా మాయ చేసిన మహేంద్రుడు!