ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో క్రికెట్ అభిమాని డేనియల్ జర్వో(jarvo) మరోసారి ప్రత్యేక్షమయ్యాడు. ఇంగ్లాండ్- భారత్ నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆయన మైదానంలోకి దూసుకురావడం.. బౌలింగ్ చేయడం.. స్టేడియంలోని ప్రేక్షకులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
-
Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021Jarvo again!!! Wants to bowl this time 😂😂#jarvo69 #jarvo #ENGvIND #IndvsEng pic.twitter.com/wXcc5hOG9f
— Raghav Padia (@raghav_padia) September 3, 2021
టీమ్ఇండియా- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో క్రికెట్ అభిమాని, యూట్యూబర్ డేనియల్ జర్వో మరోసారి ప్రత్యక్షమయ్యాడు. ఉమేశ్ యాదవ్(Umesh yadav) బౌలింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెరపువేగంతో దూసుకొచ్చాడు. ఈసారి బౌలర్‌గా యాక్షన్ పూర్తి చేసిన అతడు.. చివర్లో పట్టుతప్పి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ బెయిర్ స్టోను ఢీకొట్టాడు. ఈ ఉదంతంతో సోషల్ మీడియాలో జర్వో గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
జర్వో వ్యవహరించిన తీరు సరికాదని చెబుతూ, కామెంటేటర్ హర్ష భోగ్ల్ ట్వీట్ కూడా చేశారు.
-
I think a few people need to be sacked at grounds in England. This is a very serious security lapse and it just continues. Not even a prank anymore. #Jarvo #Idiot.
— Harsha Bhogle (@bhogleharsha) September 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I think a few people need to be sacked at grounds in England. This is a very serious security lapse and it just continues. Not even a prank anymore. #Jarvo #Idiot.
— Harsha Bhogle (@bhogleharsha) September 3, 2021I think a few people need to be sacked at grounds in England. This is a very serious security lapse and it just continues. Not even a prank anymore. #Jarvo #Idiot.
— Harsha Bhogle (@bhogleharsha) September 3, 2021
జర్వో అంతకు ముందు లార్డ్స్‌లోని రెండో టెస్టు మధ్యలోనే మైదానంలో వచ్చాడు. తాను ఇండియా క్రికెటర్‌నంటూ హడావుడి చేశాడు. అప్పుడు మైదాన సిబ్బంది అతడిని బయటకు లాక్కొని వెళ్లారు.
లీడ్స్‌లో మూడో టెస్టులో ఈసారి ఏకంగా హెల్మెట్, ప్యాడ్ ధరించిన బ్యాటింగ్ చేస్తానంటూ జర్వో వచ్చాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. తొలుత జర్వోను భారత క్రికెటర్ అనుకున్న మైదాన సిబ్బంది.. అసలు విషయం తెలుసుకుని అతడిని బయటకు లాగేశారు.
ఇవీ చదవండి:
- కోహ్లీ ఇన్‌స్టా రికార్డు.. ఇండియన్ సెలబ్రిటీల్లో అగ్రస్థానం!
- Tokyo Paralympics: ప్రవీణ్‌కు గూగులే తొలి గురువు!