క్రికెట్ తనకు ఎదగనివ్వడం లేదనే ఆక్రోషంతో పంజాబ్‌లోని మొహాలీకి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ అలియాస్ సిమి సింగ్(Simi Singh).. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసేందుకు 2005లో ఐర్లాండ్ వెళ్లాడు. దేశం మారినా.. క్రికెట్‌పై తనకున్న అభిరుచి మాత్రం మారలేదు. చదువుతో పాటు క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకొని.. డబ్లిన్‌లోని మలాహిడ్ క్రికెట్ క్లబ్లో చేరాడు. అక్కడి నుంచి అతడి దశ తిరిగింది. కట్ చేస్తే ఐర్లాండ్ జాతీయ జట్టులో(Ireland cricket team) స్థానం దక్కించుకున్నాడు.
8వ స్థానంలో సెంచరీతో అరుదైన రికార్డు..
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సిమి సింగ్.. సెంచరీ(Simi Singh century) సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 8 లేదా అంతకంటే దిగువ స్థానంలో వచ్చి సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా సిమి సింగ్ ఘనత సాధించాడు.
![Ireland's Simi Singh, first cricketer to score ODI century batting at No 8, has India connect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12494722_simi-singh_1.jpg)
"ఇది నిజంగా ఓ అద్భుతమైన ఇన్నింగ్స్. నేను సెంచరీ పూర్తి చేసిన తర్వాత.. నా క్రికెట్ ప్రయాణం మొత్తాన్ని అవలోకనం చేసుకున్నాను. అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది".
- సిమి సింగ్, ఐర్లాండ్ క్రికెటర్
![Ireland's Simi Singh, first cricketer to score ODI century batting at No 8, has India connect](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12494722_simi-singh.jpg)
ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను(SA Vs IRE) దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. శుక్రవారం ఆఖరిదైన మూడో వన్డేలో సఫారీ జట్టు 70 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది. ఓపెనర్లు జానేమన్ మలన్ (177 నాటౌట్), డికాక్ (120) భారీ శతకాలతో చెలరేగారు. ఛేదనలో ఐర్లాండ్ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో ఎనిమిదో స్థానంలో వచ్చిన సిమి సింగ్ (100 నాటౌట్) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేశాడు.
ఇదీ చూడండి.. సెంచరీతో 'స్టోన్' రెచ్చిపోయినా.. పాక్‌దే విజయం